టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ మరియు బాలీవుడ్ లో కూడా టాప్ స్టార్ హీరోయిన్ గా దాదాపుగా పుష్కకర కాలం పాటు వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ శ్రియ శరణ్. ఇప్పటికి కూడా సినిమాల్లో నటిస్తూనే ఉంది. మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ ఆర్ ఆర్ లో కూడా ఈమె నటించింది. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రియా నుండి మరిన్ని సినిమాలు వస్తాయని ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా శ్రియ తాను ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లుగా ప్రకటించి షాక్ ఇచ్చింది. ఆ పాపకు రాధా అనే పేరును కూడా పెట్టింది.
పాపకు రాధా అనే పేరు పెట్టడానికి కారణం ఏంటీ అంటూ చాలా మంది చాలా రకాలుగా ప్రశ్నించడంతో శ్రియా ఆ విషయమై స్పందించింది. నాకు పాప పుట్టింది అని చెప్పిన వెంటనే అమ్మ చాలా సంతోషించింది. రాధా వచ్చింది అంటూ వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలోనే శ్రియ భర్త రాధా అంటే రష్యన్ భాషలో సంతోషం. కనుక రాధా అనే పేరును పెట్టడం వల్ల అన్ని విధాలుగా బాగుంటుంది అంటూ నిర్ణయానికి వచ్చారట. ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాతే రాధా అని పేరు పెట్టారట.
Recent Random Post: