కలర్ ఫుల్ గా ‘మాస్ట్రో’ ప్రమోషనల్ సాంగ్ ప్రోమో..!


యూత్ స్టార్ నితిన్ – ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ”మాస్ట్రో”. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిల్కీబ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న డిస్నీ+ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వదిలిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. స్ట్రీమింగ్ డేట్ దగ్గరకు వస్తుండటంతో ప్రచార కార్యక్రమాలు శరవేగంగా నిర్వహిస్తున్న మేకర్స్.. మాస్ట్రో ప్రమోషనల్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

”షురూ కరో” అంటూ ‘మాస్ట్రో’ ప్రమోషనల్ సాంగ్ ప్రోమోని తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ‘మాస్ట్రో మాస్ట్రో ఐ యామ్ మాస్ట్రో.. లవ్లీ లైఫే ప్రతిరోజూ లవర్ తో.. జలీ లైఫే జాబిల్లి ఫ్లవర్ తో..’ అంటూ సాగిన ఈ ప్రోమో కలర్ ఫుల్ గా ఉంది. ప్రత్యేకంగా వేయబడిన సెట్ లో నితిన్ – తమన్నా – నభా నటేష్ లపై ఈ పాటను షూట్ చేశారు. శేఖర్ మాస్టర్ కంపోజిషన్ లో హీరోహీరోయిన్లు వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. మహతి స్వర సాగర్ బాణీలు సమకూర్చిన ఈ సాంగ్ కు శ్రీమణి లిరిక్స్ అందించారు. యువ గాయకుడు రేవంత్ పాటను హుషారుగా ఆలపించారు.

‘మాస్ట్రో’ ప్రచారంలో భాగంగా చిత్రీకరించిన ‘షురూ కరో’ ప్రమోషనల్ సాంగ్ పూర్తి వీడియో రేపు (సెప్టెంబర్ 12) ఆదివారం సాయంత్రం 5.04 గంటలకు విడుదల కానుంది. ఈ చిత్రానికి జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించగా.. సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించారు. ఎస్ఆర్ శేఖర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ చిత్రంలో సీనియర్ నరేష్ – జిషుసేన్ గుప్తా – శ్రీముఖి – అనన్య – హర్షవర్ధన్ – రచ్చ రవి – మంగ్లీ – శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి – నికిత రెడ్డి ”మాస్ట్రో” చిత్రాన్ని నిర్మించారు. ఇందులో బ్లైండ్ పియానో ప్లేయర్ గా నితిన్ కనిపించనున్నాడు. ఇది హిందీలో శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ‘అంధాధున్’ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. హాట్ స్టార్ లో రాబోతున్న ఈ చిత్రం.. తెలుగు ఆడియన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Recent Random Post: