హైదరాబాద్ లోని ఒక పబ్ లో సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ కు ఘోర అవమానం

సిద్ శ్రీరామ్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ సెన్సేషనల్ సింగర్ ఏ పాట పాడినా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయం. కేవలం తను పాడిన నీలి నీలి ఆకాశం అనే సాంగ్ వల్ల 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే ప్రదీప్ సినిమా మంచి విజయం సాధించింది. సిద్ పాడిన ఏ పాట అయినా అది చార్ట్ బస్టర్ గా నిలుస్తుండడంతో ఈ సింగర్ ఇప్పుడు ఫుల్ డిమాండ్ లో ఉన్నాడు.

టాలీవుడ్ లో టాప్ సింగర్ గా వెలుగొందుతున్న సిద్ శ్రీరామ్ కు హైదరాబాద్ లోని ఒక పబ్ లో ఘోర అవమానం జరిగిందట. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10సిలో ఉన్న సన్ బర్న్ సూపర్ క్లబ్ లో మూడు రోజుల పాటు శ్రీరామ్ మ్యూజికల్ కన్సర్ట్ జరుగుతోంది.

అయితే నిన్న కొందరు ఆకతాయిలు బాగా తాగి మద్యం మత్తులో సిద్ పై నీళ్లు, మద్యం విసిరేశారట. చాలా మంది ప్రముఖులు కూడా ఈ పబ్ కు రావడంతో యాజమాన్యం పరిస్థితిని అదుపులోకి తెచ్చి ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడింది. సిద్ శ్రీరామ్ కూడా పోలీసుల వరకూ వెళ్లకుండా మ్యానేజ్ చేసింది.


Recent Random Post: