సింగర్ కం డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలపై ఎప్పటికప్పుడు ఫైర్ అవుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఏదైనా అనర్ధం జరిగితే అందులో ఎక్కువగా మహిళలను దోషులుగా చూపించడంపై చిన్మయి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. మీటూ వ్యవహారంలో పెద్ద ఉద్యమమే నడిపిన చిన్మయి రీసెంట్ గా ఫన్ బకెట్ భార్గవ్ కేసుపై స్పందించారు.
తెలివిగా మాయమాటలు చెప్పి మైనర్ బాలికలను లోబరుచుకునే సన్నాసులు ఈ సమాజంలో చాలా మందే ఉన్నారని చిన్మయి తెలిపింది. అయితే ఈ కేసు విషయంలో మీడియా స్పందిస్తున్న తీరుపై కూడా ఆమె విస్మయం వ్యక్తం చేసింది.
“తల్లి వద్దే మైనర్ బాలిక ఉంటుండడం, తండ్రి దూరంగా ఉండడం, అమ్మాయిపై సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వంటివి దీనికి కారణాలుగా – అమ్మాయి వైపే తప్పు ఉన్నట్లుగా మీడియా చూపిస్తోండడం నిజంగా దురదృష్టకరం” అని చిన్మయి వాపోయింది.
Recent Random Post: