నాకు ప్రెగ్నెన్సీ కాదు.. ఆ ప్రాబ్లంః హీరోయిన్

సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా జనాలకు అమితాసక్తి ఉంటుంది. అందుకే.. వాళ్లు ఏమీ చెప్పకపోయినా.. కనీసం మాట్లాడకపోయినా సరే.. వాళ్లను చూస్తే =చాలు వార్తలు వాటంతట అవే పుట్టుకొచ్చేస్తాయి. ఆ విధంగా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ పై ఓ రూమర్ పుట్టుకొచ్చింది. మరి అలా బయటకు వచ్చిన న్యూస్ ఆగుతుందా..? మీడియా సోషల్ మీడియా అంటూ.. రచ్చ రచ్చ చేసింది. ఈ విషయం చివరకు సోనమ్ వరకు చేరడంతో వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

ఇంతకూ విషయం ఏమంటే.. దాదాపు ఏడాది కాలంగా లండన్ లో ఉన్న సోనమ్ కపూర్.. తాజాగా ఇండియాలో తిరిగి వచ్చింది. ముంబై ఎయిర్ పోర్టులో దిగిన ఆమెను చూసిన జనం కథలు అల్లేశారు. ఏమనీ.. సోనమ్ అంటే ఫ్యాషన్ ఐకాన్. కాబట్టి.. నిత్యం ట్రెండీ లుక్స్ లోనే కనిపిస్తుంది. కనిపించాలి కూడా. కానీ.. వదులుగా ఉండే డ్రెస్ వేసుకుందేమిటీ? అని దీర్ఘం తీశారు. ”కొంపదీసి.. ఇది అదేనా?” అనుకున్నారు. ఆ వెంటనే వార్తలు అల్లేశారు.

సీన్ కట్ చేస్తే.. సోషల్ మీడియాలో సోనమ్ కపూర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తడం మొదలు పెట్టాయి. ”తల్లి కాబోతున్న సోనమ్ కపూర్ కు ఇవే.. మా హార్ధిక శుభాకాంక్షలు” అంటూ విషెస్ చెప్పడం స్టార్ట్ చేశారు. ఈ విషయం అటూ ఇటూ తిరిగి సోనమ్ వద్దకు చేరింది. ఇదెక్కడి గొడవరా నాయనా.. అనుకున్న బాలీవుడ్ బ్యూటీ వెంటనే స్పందించింది. ”అమ్మలారా.. అయ్యలారా.. అసలు విషయం ఏమంటే..” అని వాస్తవం ఏంటో చెప్పేసింది.

”నాకు మంథ్లీ పీరియడ్స్ వచ్చాయని చెప్పేసింది. ఇదిగో.. వేడి నీళ్లు అల్లం టీ తాగుతున్నాను” అని ఫొటో పెట్టి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో.. గ్రీటింగ్స్ చెప్పినవాళ్లు నాలుక కరుచుకున్నారు. అదన్నమాట సోనమ్ ప్రెగ్నెన్సీ ఇష్యూ.


Recent Random Post: