సోనుసూద్ కు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. బృహన్ ముంబయి కార్పొరేషన్ ఇచ్చిన నోటీసులను హైకోర్టులో సవాల్ చేస్తూ సోనూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. జుహూలో ఉన్న తన ఆరు అంతస్తుల భవనం విషయంలో సోనూసూద్, బీఎంసీకు మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ భవనాన్ని అనుమతులు లేకుండా హోటల్‌గా మార్చారంటూ గతేడాది అక్టోబర్‌లో బీఎంసీ అధికారులు సోనూసూద్‌కు నోటీసులు పంపించారు. ఈ నోటీసులపైనే సోనుసూద్ హైకోర్టులో సంప్రదించారు.
విచారణలో భాగంగా.. ఈ విషయమై సోనుసూద్ కు ఎన్నో నోటీసులు పంపించినా స్పందించలేదని బీఎంసీ అధికారులకు న్యాయమూర్తికి విన్నవించారు. గతంలో కూడా సోనుకు చెందిన భవనాలను అక్రమ కట్టడాలుగా కూల్చేసామని విన్నవించారు. ఈ ఆరోపణలను సోనుసూద్ ఖండించారు. ఆ భవనాన్ని హోటల్ గా మార్చేందుకు అవసరమైన ‘ఛేంజ్ ఆఫ్ యూజర్’ అనుమతులు తీసుకున్నట్టు తెలిపారు.
ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి పృథ్వీరాజ్ చౌహాన్ నటుడు సోనుసూద్ పిటిషన్ ను కొట్టివేశారు. బీఎంసీ అధికారులు నోటీసులు పంపించినప్పుడే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇప్పటికే ఎంతో ఆలస్యం చేశారు కాబట్టి తాము చేయగలిగిందేమీ లేదని.. బీఎంసీనే సంప్రదించాలని న్యాయమూర్తి సూచించారు.
Recent Random Post: