బీఎంసీతో యుద్ధం.. సుప్రీమ్ లో సవాల్ చేసిన సోను సూద్

కరోనా సమయంలో తన సేవా కార్యక్రమాలతో విశేషమైన పేరు తెచ్చుకున్న సోను సూద్ ఇప్పుడు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తో భారీ యుద్ధమే చేస్తున్నాడు. సోను సూద్ కు ముంబై జుహూ ప్రాంతంలో ఆరంతస్థుల భవనం శక్తి సాగర్ ఉంది. దీన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని బిఎంసీ ఆరోపిస్తోంది. అంతే కాకుండా అనుమతులు తీసుకోకుండా ఈ భవనాన్ని హోటల్ గా మార్చారని కూడా అధికారులు అంటున్నారు. దీంతో భవనాన్ని వెంటనే కూల్చాలని వారు అంటున్నారు.

ఈ విషయంపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యాడు సోను సూద్. బాంబే హైకోర్టులో తన భవన కూల్చివేతను చేపట్టకూడదని సోను సూద్ కోరాడు. అయితే ఈ పిటీషన్ ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఇప్పుడు న్యాయపోరాటం సుప్రీమ్ కోర్టుకు చేరుకుంది. తన భవనాన్ని కూల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాడు సోను సూద్.

ఇక కోర్టు విచారణ సందర్భంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సోను సూద్ అలవాటుపడ్డ నేరస్థుడని పేర్కొంది. 2018, 2020 ఫిబ్రవరిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినప్పటికీ మళ్లీ నిర్మించారని ఆరోపించింది.


Recent Random Post: