సినీ నటుడు సోనూసూద్ ఈమద్య కాలంలో వరుసగా ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. గత ఏడాది నుండి ఈ ఏడాది వరకు ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేసి ఆదుకుంటూ వస్తున్నారు. సోనూసూద్ వల్ల ఎంతో మంది ప్రాణాలు దక్కించుకున్నారు. ఆయన ఆక్సీజన్ తో కొన్ని వందల మందికి జీవం నిలిచి అనడంలో సందేహం లేదు. అలాంటి సోనూసూద్ మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్య పల్లెలకు డెడ్ బాడీ ఫ్రిజర్ లు అందించేందుకు ముందుకు వచ్చాడు.
గ్రామాల్లో మృతి చెందిన వారిని వెంటనే అంత్య క్రియలు చేయకుండా కుటుంబ సభ్యులు వచ్చేందుకు అవకాశం కల్పించేలా సోనూసూద్ డెడ్ బాడీ ఫ్రిజర్ ను కొనుగోలు చేసి పలు గ్రామాలకు ఇవ్వబోతున్నాడు. డెడ్ బాడీ ఫ్రిజర్ లు లేక పోవడం వల్ల అయిన వారు చనిపోయిన వారి చివరి చూపుకు నోచుకోవడం లేదు. దాంతో సోనూసూద్ ఎవరైతే చనిపోతారో వారి కుటుంబ సభ్యుల కోసం ఈ మంచి పనిని చేయడం జరిగిందట. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. సోనూసూద్ గొప్ప పనిని అంతా అభినందిస్తున్నారు.
. @Sonusood going to sponsor dead body freezer boxes in needy villages !!!#Sonusood pic.twitter.com/l9q1iRz1q2
— ??????????? (@UrsVamsiShekar) May 31, 2021
Recent Random Post: