సోను సూద్ ను రియల్ హీరో అని కొందరు అంటుంటే, దేవుడు అని చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యంగా కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో సోను సూద్ ఎన్ని వేల మందికి ఎన్ని రకాలుగా సహాయం చేసాడో అందరికీ తెలుసు. కష్టమని అంటే చాలు వాళ్ళకు నిమిషాల్లో సహాయం అందేలా చేయడం సోను సూద్ స్పెషలిటీ.
తనకే కాక తన భార్య, పిల్లలకు కూడా వేల కొద్దీ సహాయం చేయమని రిక్వెస్ట్ లు వచ్చాయట. దానిని వారు వెంటనే తన వద్దకు తీసుకొచ్చి తనకు సహాయం చేసారని సోను సూద్ తెలిపాడు.
ఇక తన ప్రధాన లక్ష్యాన్ని కూడా రివీల్ చేసాడు సోను సూద్. “కరోనా సమయంలో ప్రజల కష్టాల్ని చూస్తే నా మనసు కదిలిపోయింది. అందుకే వీలైనంత మందికి సహాయం చేయాలనుకున్నా. ఇక ఉచితంగా విద్య, వైద్యం అందించాలన్నది నా లక్ష్యం. ఇందుకోసం ఆసుపత్రులు, పాఠశాలలు నెలకొల్పాలని అనుకుంటున్నాను” అని సోను సూద్ వివరించాడు.
Recent Random Post: