లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనెర్స్ కు పెట్టింది పేరుగా నిలిచాడు శ్రీకాంత్ అడ్డాల. ముఖ్యంగా కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలతో ప్రామిసింగ్ దర్శకుడు అనిపించుకున్నాడు. అయితే బ్రహ్మోత్సవం ప్లాప్ కావడంతో శ్రీకాంత్ అడ్డాల కెరీర్ లో చాలా పెద్ద బ్రేక్ వచ్చింది.
అయితే గతేడాది తమిళంలో హిట్ అయిన అసురన్ రీమేక్ ను డైరెక్ట్ చేసాడు. తన జోనర్ కాకపోయినా వెంకటేష్ ను హ్యాండిల్ చేసిన విధానం అందరినీ ఇంప్రెస్ చేసింది.
ఇక శ్రీకాంత్ ఇప్పుడు తన తర్వాతి చిత్రంపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఈసారి స్ట్రెయిట్ సినిమానే చేస్తాడని సమాచారం. అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి బావమరిదిని హీరోగా పరిచయం చేసే బాధ్యతను శ్రీకాంత్ తీసుకుంటున్నాడట. ఈ ప్రాజెక్ట్ వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
Recent Random Post: