శ్రీముఖిలో ఈ టాలెంట్‌ కూడా ఉందా!

స్టేజ్‌పై‌ అల్లరి చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రముఖ యాంకర్‌ శ్రీముఖిలో ఎవరిక తెలియని టాలెంట్‌ ఉంది. మహశివరాత్రి సందర్భంగా శ్రీముఖిలోని చిత్రకారిణికి బయటకు వచ్చింది. జాగరణ చేస్తూ తను శివుడి బొమ్మ గీసినట్లు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. ‘శివరాత్రి రోజు రాతంత్రా జాగారం చేశాను. నిద్ర రాకుండా ఉండేందుకు ఈ శివుడి బొమ్మ గీశాను’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ల స్టోరీ షేర్‌‌ చేసింది.

శ్రీముఖీ గీసిన శివుడి బొమ్మ ఆమె ఫాలోవర్స్‌, నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ‘తనలో ఈ టాలెంట్‌ కూడా ఉందా’, ‘స్టేజ్‌పై చిన్న పిల్లలా అల్లరి చేసే శ్రీముఖిలో ఓ చిత్రకారిణిని దాగుంది’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఆమె నటించిన క్రేజీ అంకుల్‌ మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఇందులో ప్రముఖ గాయకుడు మనో, రఘుకుంచెతో నటుడు రాజ రవీంద్ర కీలక పాత్రలో నటించారు.


Recent Random Post: