ఫ్రెండుతో పోటీపడి కిచ్చ సుదీప్ హిట్టు?


మన ప్రేక్షకులకు ఎప్పటినుండో బాగా పరిచయమున్న శాండల్ వుడ్ హీరోలు ఇద్దరు ఉపేంద్ర, సుదీప్. కేవలం అయిదు రోజుల గ్యాప్ తో బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధపడటం ఆడియన్స్ లో ఆసక్తి రేపింది. యుఐకి ఇతర భాషల్లో టాక్ సోసోగా ఉన్నప్పటికీ కన్నడలో మాత్రం సూపర్ హిట్ దిశగా వెళ్తున్నట్టు వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. సులభంగా అర్థం కాని కంటెంట్ ఉన్నా సరే తమకు అలవాటైన ఉప్పి స్టైల్ ని అర్థం చేసుకుని కలెక్షన్లు ఇస్తున్నారు. డిసెంబర్ 20 యుఐ థియేటర్లలో అడుగుపెడితే 25న మాక్స్ వచ్చేసింది. తెలుగులో రెండు రోజులు ఆలస్యంగా నిన్న తీసుకొచ్చారు. ఇక అసలు పాయింటుకొద్దాం.

కార్తీ ఖైదీ తరహాలో మాక్స్ ఉన్నప్పటికీ యాక్షన్ బ్లాక్స్, ఎలివేషన్స్ విషయంలో దర్శకుడు విజయ్ కార్తికేయ తీసుకున్న శ్రద్ధ మాస్ ని ఓ మోస్తరుగా మెప్పిస్తోంది. ఇద్దరు బడా మంత్రుల కొడుకులు తన కస్టడీలో చనిపోతే వాళ్ళ మనుషులు చేసే దాడి నుంచి స్టేషన్ ని కాపాడుకునే ఒక పోలీస్ ఆఫీసర్ కథే మాక్స్. విక్రాంత్ రోనా తర్వాత సుదీప్ కు ఎప్పుడూ లేనంతగా రెండేళ్ల గ్యాప్ వచ్చింది. మధ్యలో రెండు క్యామియోలు చేశాడు కానీ అవేం వర్కౌట్ కాలేదు. అందుకే టైం ఎక్కువ పట్టినా మాక్స్ కోసం విపరీతంగా కష్టపడ్డాడు. ఫలితం చూస్తుంటే యుఐకి ధీటుగా అంతకు మించి వెళ్లే సూచనలున్నాయి.

తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు సైతం పర్వాలేదనే టాక్ ఈ వారాంతంలో ఉపయోగపడేలా ఉంది. క్రిస్మస్ సినిమాలన్నీ దాదాపు టపా కట్టేశాయి. అందుకే పుష్ప 2 మళ్ళీ పికప్ అయ్యింది. దాన్ని రెండు మూడు సార్లు చూసినవాళ్లకు బెస్ట్ ఆప్షన్ మరొకటి లేకుండా పోయింది. దీన్ని మాక్స్ ఏ మేరకు వాడుకుంటుందో చూడాలి. తిరిగి జనవరి 10 వరకు చెప్పుకోదగ్గ కొత్త రిలీజులు లేవు. కొత్త ఏడాదికి ఏకంగా అయిదు పాత రీ రిలీజులను ప్లాన్ చేశారంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాక్స్ లో ప్రధానంగా హైలైట్ అవుతున్న వాటిలో విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు.


Recent Random Post: