కన్నడలో టాప్ హీరో సుదీప్ తెలుగులో కూడా సుపరిచితుడే. ప్రస్తుతం క్రేజీ సినిమాలను సుదీప్ చేస్తోన్న విషయం తెల్సిందే. సుదీప్ హీరోగా చేస్తోన్న సినిమా విక్రాంత్ రోనా. ఈ సినిమా భారీ బడ్జెట్ తో కన్నడ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఎగ్జైటింగ్ అప్డేట్ ఏంటంటే ఈ చిత్ర ప్రమోషన్స్ ను వేరే లెవెల్ లో చేయాలని డిసైడ్ అయ్యారు నిర్మాతలు. అందుకే ఫస్ట్ లుక్, స్నిక్ పీక్ ను ఏకంగా బుర్జ్ ఖలీఫా మీద విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. జనవరి 31న టైటిల్ లోగోతో పాటు 180 సెకన్ల స్నిక్ పీక్ ను విడుదల చేయనున్నారు. ప్రపంచంలో ఈ తరహా ప్రమోషన్స్ చేస్తోన్న మొదటి సినిమా విక్రాంత్ రోనా కావడం విశేషం.
అనూప్ఈ భండారి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో విడుదల కానున్నాయి.
Recent Random Post: