సుకుమార్ – విజయ్ దేవరకొండ సినిమా స్టేటస్ ఏంటి?

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. గతేడాది ఈ సినిమా అనౌన్స్మెంట్ రాగా అప్పటినుండి ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి.

అయితే నిర్మాణ సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ దీనిపై వివరణ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం సుకుమార్ పుష్ప చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. అలాగే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.

ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయితే కానీ ప్రస్తుత ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం లేదు. ఇక తాజా సమాచారం ప్రకారం సుకుమార్, విజయ్ దేవరకొండతో కలిసి షూటింగ్ కోసం లొకేషన్స్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డాడట. కథ ప్రకారం మెజారిటీ భాగం షూటింగ్ తెలంగాణలోనే జరుగుతుందని తెలుస్తోంది.


Recent Random Post: