దర్శకుడు బుచ్చి బాబు సనా ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తొలి సినిమాతోనే విడుదలకు ముందు బోలెడంత సెన్సేషన్ క్రియేట్ చేసింది ఉప్పెన. ఈ బుచ్చి బాబు సనా సుకుమార్ శిష్యుడన్న విషయం తెల్సిందే. అయితే కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా సుకుమార్ టీచర్ గా ఉన్నప్పుడు ఆయన విద్యార్థి బుచ్చి బాబు. ఇంటర్మీడియట్ డేస్ నుండి పరిచయం.
ఆర్య 2 నుండి సుకుమార్ వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు బుచ్చి బాబు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి చిత్రాల్లో రైటింగ్ విషయంలో కూడా బుచ్చి బాబు సహాయం ఎంతో ఉందని తెలిసింది. ఇదిలా ఉంటే ఉప్పెన సినిమాకు సంబంధించి రీషూట్లు చాలా జరిగాయని, సుకుమార్ కూడా దర్శకత్వంలో ఇన్వాల్వ్ అయ్యారని కొన్ని సీన్లను లేపేసారని రూమర్లు బలంగా ప్రచారమయ్యాయి.
ఈ విషయాలపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. బుచ్చి బాబు మాట్లాడుతూ ఉప్పెన సినిమాకు సంబంధించి ఒక్క సీన్ కూడా రీషూట్ జరగలేదని, సుకుమార్ గారు కూడా రీషూట్ విషయంలో ఏం చెప్పలేదని అన్నారు. కేవలం ఫ్రేమింగ్ విషయంలో కరెక్ట్ గా ఉండడానికి మాత్రమే చర్చలు జరిగాయని తెలుస్తోంది.
Recent Random Post: