విలక్షణమైన చిత్రాలతో హీరోగా తనకంటూ ప్రత్యేతను చాటుకుంటున్నారు యంగ్ హీరో సందీప్ కిషన్. దేవా కట్టా రూపొందించిన ‘ప్రస్థానం’ సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన సందీప్ కిషన్ పుట్టిన రోజు నేడు. తను హీరోగా కెరీర్ ప్రారంభించింది మాత్రం ‘రొటీన్ లవ్ స్టోరీ’తోనే. టాలెంటెడ్ హీరోగా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. సినిమా అంటే పాషన్ తనకు. అదే పాషన్ తో క్రేజీ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ వద్ద ఏడాది పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. అయితే తనకు డైరెక్టర్ గా కెరీర్ కొనసాగడం కంటే నటుడిగా సినిమాల్లోకి రావడమే ఇష్టం కావడంతో ‘ప్రస్థానం’తో నటుడిగా తన నట ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు.
నటుడికి వుండాల్సిన టాలెంట్ ఇండస్ట్రీలో స్తృతంగా వున్న పరిచయాలు. అతనిలో వున్న ఏదో గమ్మత్తు అతన్ని ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టింది. హీరోగా సందీప్ అందుకున్న తొలి సక్సెస్ ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’. ఈ సినిమాతో హీరోగా తొలి కమర్షియల్ సక్సెస్ ని సొంతం చేసుకున్న సందీప్ కిష్ అప్పటి నుంచి వరుస చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనదైన స్టైల్ వినోదాన్ని అందిస్తున్నాడు. దాదాపు 12 ఏళ్ల కెరీర్ లో ఇప్పటికీ హీరోగా 28 చిత్రాల వరకు పూర్తి చేశాడు.
అయితే అందులో సక్సెస్ ని అందుకున్నవి రెండే రెండు చిత్రాలు కావడం గమనార్హం. వీ. ఐ. ఆనంద్ అందించిన టైగర్ సినిమా సందీప్ కు దక్కిన రెండవ విజయం. ఈ సినిమాలో సందీప్ నటనపై రవితేజ అల్లు అర్జున్. ఆర్ . నారాయణ మూర్తి వంటి వారు ప్రశంసలు కురిపించారు. సీనియర్ స్టార్ కెమెరామెన్ చోటా. కె నాయుడు మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించినా తనదైన పంధాలో అందరినీ ఆకట్టుకుంటూ తనకంటూ ఓ సర్కిల్ ని ఏర్పాటు చేసుకున్నాడు సందీప్ కిషన్.
అభిరుచి గల హీరోగా వినూత్నమైన కథల్ని ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లోనూ రాణిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారీ యంగ్ హీరో. మరీ ముఖ్యంగా తెలుగుతో పాటు తమిళంలోనూ హీరోగా రాణిస్తూ మంచి పేరుతో పాటు అక్కడ మంచి మార్కెట్ ని కూడా దక్కించుకోవడం నిజంగా గ్రేట్ అని చెప్పాల్సిందే.
అయితే సక్సెస్ రేట్ మరీ తక్కువగా వున్న ఈ హీరో మళ్లీ ట్రాక్ లోకి రావాలని ప్రస్తుతం దక్షిణాదికి చెందిన పాన్ ఇండియా చిత్రాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో పాన్ ఇండియా మూవీతో లక్ ని టెస్ట్ చేసుకోబోతున్నారు.
సందీప్ కిషన్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’. రంజిత్ జయకోడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఈ మూవీతో పాటు వీఐ ఆనంద్ తరకెక్కిస్తున్న థ్రిల్లర్ ఎంటర్ టైనర్ కు ‘ఊరు పేరు భైరకోన’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పణలో హాస్యా మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 12 ఏళ్ల కెరీర్ లో రెండే రెండు హిట్లతో 28 సినిమాల వరకు నెట్టుకు రావడం నిజంగా సందీప్ కిషన్ గ్రేట్ అనాల్సిందే.
Recent Random Post: