#BiggBoss5: మరో సోహెల్ అవుతున్న సన్నీ


బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన సమయంలో ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని వారు రోజులు గడుస్తున్నా కొద్ది పెద్ద సెలబ్రెటీలుగా మారిపోతూ ఉంటారు. హౌస్ లో వారి ప్రవర్తన మరియు వారు కొన్ని విషయాల్లో వ్యవహరించే తీరుతో మంచి వారు అనుకున్న వారి పట్ల చెడు అభిప్రాయం కలుగవచ్చు.. ఎలాంటి అభిప్రాయం లేని వారిపై మంచి అభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది. తెలుగు బిగ్ బాస్ 5వ సీజన్ ప్రారంభం అయిన సమయంలో షన్నూ.. శ్రీరామ్ చంద్ర మరియు యాంకర్ రవిల గురించి జనాలు ఎక్కువ పాజిటివ్ గా మాట్లాడుకున్నారు. కాని ఇప్పుడు మెల్ల మెల్లగా ప్రేక్షకుల అభిప్రాయాలు మారిపోతున్నాయి. మొదట్లో సన్నీ గురించి పెద్దగా చర్చ జరిగిందేమి లేదు. కాని ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో వీజే సన్నీ పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగి పోతుంది అనడంలో సందేహం లేదు. గత సీజన్ లో సోహెల్ ఎలా అయితే ఆవేశంతో రెచ్చి పోయేవాడో అలాగే ఇప్పుడు సన్నీ కూడా ఆవేశంతో రెచ్చి పోతున్నాడు.

సన్నీ కి చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఆవేశం ఉన్న ఆటగాళ్లు కొన్ని సార్లు శృతి తప్పుతారు. కాని ఇంతకు ముందు సీజన్ లో సోహెల్ మరియు ఇప్పుడు సన్నీ అస్సలు శృతి తప్పలేదు. ఎంత వరకు తమ ఆవేశంను చూపించాలో అంత ఆవేశంను చూపిస్తున్నారు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం కొన్ని సార్లు మంచి జరుగుతుంది. సన్నీకి అలా తీసుకున్న కొన్ని నిర్ణయాలు అతడి ఆట తీరును మార్చేశాయి. ప్రేక్షకులు అతడి వెంట నిలబడేలా చేశాయి. ఖచ్చితంగా టాప్ 5 లో సన్నీ ఉంటాడనే నమ్మకం.. అభిప్రాయం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. సన్నీని ఈ వారం మొత్తం కొందరు టార్గెట్ చేసినట్లుగా ఆడారు. దాంతో మరింతగా అతడిపై ప్రేక్షకుల్లో సానుభూతి మరియు అభిమానం పెరిగింది అనడంలో సందేహం లేదు. కెప్టెన్ అయినందుకు కొందరు కంఠు అయితే మరి కొందరు గేమ్ లో అతడిని రెచ్చ గొట్టినట్లుగా మాట్లాడటం ద్వారా మరింత గా సన్నీకే ఫేవర్ చేసినట్లు అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి సన్నీ ఈ సీజన్ లో ప్రత్యేకంగా నిలుస్తాడని ఆయన అభిమానులు అంటూ ఉన్నారు. ఈ వారంలో సన్నీని కొందరు టార్గెట్ చేసిన తీరు కారణంగా మరింతగా పాపులారిటీని దక్కించుకున్నాడు. గత వారంలో ప్రియా వల్ల బాగా సానుభూతి దక్కించుకున్న సన్నీకి ఈవారం కూడా మంచి జరిగిందనే చెప్పాలి. మొత్తానికి వారం వారం సన్నీ కి మద్దతు పెరుగుతూనే ఉంది. సన్నీకి ఖచ్చితంగా ఎలిమినేషన్ భయం అనేది లేదనే చెప్పాలి. ఇంకాస్త మంచి ఆటను కనబర్చుతూ తనదైన శైలిలో ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా టాప్ 2 లో నిలుస్తాడు.. అదృష్టం బాగుంటే ట్రోఫీని కూడా నెగ్గే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే సీక్రెట్ రూమ్ నుండి బయటకు వచ్చిన లోబో కాస్త డల్ గా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా వీకెండ్ ఎపిసోడ్ లో పవర్ రూమ్ లో మాట్లాడిన మాటలు అతడికి ఇబ్బంది కలిగించాయి. ఆ మాటలు బయట వారు వింటున్నారు అనే విషయం తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడి బయటకు వచ్చి కవర్ చేసే ప్రయత్నం చేశాడు. అయినా కూడా అది ఇంపార్ట్ పడింది. దాంతో అతడు ఈ వారంలో పెద్దగా కనిపించలేదు. కనుక అతడు ఈ వారంలో ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి కొన్ని గంటల్లో ఆ విషయమై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Recent Random Post: