అగ్ర నిర్మాత సురేష్ బాబు లెక్కల విషయంలో పక్కాగా ఉంటారు. రిస్క్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడని సురేష్ బాబు ఇటీవలే నిర్మించిన నారప్ప చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేస్తున్నాడు. జులై 20న ఈ సినిమా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ నారప్పను ఓటిటిలో విడుదల చేయడాన్ని సమర్ధించుకున్నారు. ఇకపై థియేటర్లు, ఓటిటి రెండూ ఉంటాయి. ముందు థియేటర్లలోనే రావాలన్న రూల్ లేదు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలి అని తెలిపాడు.
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్ లోని రామానాయుడు ఫిల్మ్ స్టూడియో స్థలాన్ని తీసుకుని అక్కడ సచివాలయం కట్టాలని నిర్ణయించుకున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై సురేష్ బాబు స్పందించారు. వైజాగ్ లో స్టూడియో ఉన్న స్థలం మాది. ప్రభుత్వ వాటా అందులో లేదు అని క్లారిటీ ఇచ్చారు.
ఒకవేళ ప్రభుత్వం అడిగితే ఇస్తారా అని ప్రశ్నిస్తే ప్రభుత్వ ఒత్తిడి మాపై లేదు అని తెలిపాడు.
Recent Random Post: