టాలీవుడ్ టాప్ మ్యూజిషియన్ తమన్ మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యారు. పవన్ కల్యాణ్-రానా కలిసి నటిస్తున్న మల్టిస్టార్ మూవీ ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ ‘భీమ్లా నాయక్’గా వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది.
అయితే బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న మ్యూజిక్ ను ‘పెట్టా’ మూవీలోని ఓ పాట మ్యూజిక్‌లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘మళ్లీ కాపీనా.. ఇలా ఎన్నిసార్లు మోసం చేస్తావు తమన్’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. తమన్ ఇలా ట్రోల్ కావడం గతంలో చాలాసార్లు జరిగింది.
ఈ సినిమాలో పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ అనే మలయాళ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పవన్ లుక్స్, మాస్ మ్యానరిజంతో ఫాన్స్ కిక్కు ఎక్కిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Recent Random Post: