పవన్ కోసం అతన్ని దించేశారుగా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ స్పీడు పెంచారు. ఇటీవల కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా చాలా వరకు చిత్రాల నిర్మాణం ఆగిపోవడంతో తను కూడా బ్రేక్ తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి రావడంతో మళ్లీ కెమెరా ముందు సందడి చేయడం మొదలుపెట్టారు. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేస్తున్నారు. రానా మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిత్యామీనన్ సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించడంతో పాటు రచనా సహకారం అందించిన ఈ మూవీ రిలీజ్ కి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రంలోని పవన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ని మొదలుపెట్టారు. ఓ పాట కొంత ప్యాచ్ వర్క్ మిగిలి వుంది. ప్రస్తుతం ఓ పాటని పవన్ కల్యాణ్ పాల్గొనగా చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే తమన్ అందించిన గీతాలు సినిమాకు మరింత హైప్ ని తీసుకొచ్చాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ ని శ్రీకృష్ణ పృథ్వీ చంద్రలతో పాటు కిన్నెర మొగిలయ్య రామ్ మిర్యాలతో పాడించారు. ఈ పాట వైరల్ గా మారింది. ఈ పాటతో కిన్నెర మొగిలయ్య లైమ్ లైట్లోకి వచ్చారు. అయితే తాజాగా ఈ సినిమా కోసం మరో క్రేజీ సింగర్ ని రంగంలోకి దింపేశారు.

బాలీవుడ్ సింగర్ కైలాష్ ఖేర్ గాత్రానికి తెలుగులో చాలా మంది అభిమానులున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన చేత `భీమ్లా నాయక్` కోసం ఓ పాటని పాడిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి రాసిన పాటని కైలాష్ ఖేర్ ఆలపించబోతున్నారు. ఇదే విషయాన్ని తమన్ ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ ఓ గ్రూప్ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు.

నా జీనియస్ డియర్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు.. సోల్ ఫుల్ పాటలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రామజోగయ్య గారు కైలాష్ ఖేర్ కలిసి మాయాజాలం చేయబోతున్నారు. `భీమ్లా నాయక్` కు ఇది సరికొత్త ఎట్రాక్షన్ గా నిలవబోతోంది` అని ట్వీట్ చేశారు. గత కొంత కాలంగా అంటే `క్రాక్` నుంచి ఇప్పటి వరకు తమన్ పేరే వినిపిస్తోంది. అంతలా బిజీగా మారిపోయిన ఆయన `భీమ్లా నాయక్` కోసం కైలాష్ ఖేర్ తో ఓ పాట ని రికార్డు చేస్తున్నారు.


Recent Random Post: