మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ ఆరంభంలో రచయిత అనే విషయం తెల్సిందే. దర్శకుడిగా మారిన తర్వాత తన సినిమాలకు మాత్రమే రచన చేసుకునే వారు. ఒక్కటి రెండు సినిమాలకు మాత్రమే త్రివిక్రమ్ రచన సహకారం అందించారు. అయితే అల వైకుంఠపురంలో సినిమా తర్వాత ఏడాది గ్యాప్ వస్తున్న కారణంగా ఆయన ఖాళీ ఉండటం ఎందుకు అనుకుని కొన్ని స్క్రిప్ట్ ల విషయంలో రచన సహకారం అందించాడు. రామ్ నటించబోతున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో మూవీకి మరియు పవన్ మూవీకి కూడా త్రివిక్రమ్ రచన సహకారం అందించారు.
ఈ రెండు సినిమాలకు మాత్రమే కాకుండా త్రివిక్రమ్ చాలా సినిమాలకు తన వంతు సాయంను సహకారంను అందించడం జరిగింది. దాంతో ఆయన ఈ ఏడాదిలో భారీగానే మూట కట్టుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాదిలో త్రివిక్రమ్ సినిమా చేయకున్నా కూడా దాదాపుగా 15 కోట్ల వరకు ఆయన ఖాతాలో కేవలం రచన సహకారం అందించడం వల్ల దక్కించుకున్నాడని అంటున్నారు. ఒక సినిమా చేస్తే వచ్చే పారితోషికం రేంజ్ లో త్రివిక్రమ్ తన పార్ట్ టైం జాబ్ తో సంపాదించాడు. కొరటాల శివ కూడా ఆచార్యకు ముందు చాలా సినిమాలకు తనదైన రచన సహకారం అందించి ఇలాగే సంపాదించాడు అంటూ వార్తలు వచ్చాయి.
Recent Random Post: