గత ఏడాది అల వైకుంఠపురంలో సినిమాతో సూపర్ హిట్ ను దక్కించుకున్న త్రివిక్రమ్ ఆ వెంటనే ఎన్టీఆర్30 సినిమాను ప్రకటించాడు. గత ఏడాదిలోనే సినిమాను ప్రారంభించి ఈ ఏడాది సినిమాను విడుదల చేయాలని భావించినా కరోనా కారణంగా ఆలస్యం అవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు పూర్తి అవుతుందా అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ డేట్ల కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాడు. కాని తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా తో బిజీ అయ్యాడు.
ఎన్టీఆర్ తో సినిమా కమిట్ అయ్యి ఇప్పుడు పవన్ మూవీని చేస్తున్నందుకు నందమూరి అభిమానులు ఒకింత ఆగ్రహంను త్రివిక్రమ్ పై వ్యక్తం చేస్తున్నారు. పవన్ చేస్తున్న సినిమా ఫలితం తేడా కొడితే అది ఎన్టీఆర్ 30 పై ప్రభావం చూపించే అవకాశం ఉందని నందమూరి అభిమానులు అంటున్నారు. అందుకే ఎన్టీఆర్ తో సినిమాను చేసే ముందు ఎందుకు పవన్ తో సినిమా చేస్తున్నారని అంటున్నారు. అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ కు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. కాని బ్యాక్ డోర్ లో మొత్తం వ్యవహారం త్రివిక్రమ్ నడిస్తున్నాడు అంటున్నారు.
Recent Random Post: