ప్రపంచంలోనే బాలయ్య అత్యుత్తమ గాయకుడు : వర్మ

వెటకారంకు రూపం ఉంటుంది అంటే అది వర్మలా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వర్మ ఎంతటి విషయాన్ని అయినా వెటకారం చేస్తాడు. సందర్బాన్ని బట్టి వెటకారం చేయడం ఆయన శైలి. రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా డిజిటల్‌ సినిమాలపై పడ్డాడు. తన సినిమాలకు సెన్సార్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనే ఉద్దేశ్యంతో వరుసగా డిజిటల్‌ సినిమాలు తీస్తున్నాడు. తాజాగా వర్మ ఎన్‌ఎన్‌ఎన్‌ అనే చిత్రాన్ని విడుదల చేశాడు. ఆ సినిమా పబ్లిసిటీలో భాగంగా వర్మ చిట్‌ చాట్‌ చేశాడు.

ఆ సందర్బంగా బాలయ్య పాడిన శివశంకరి మరియు ఇతర పాటలపై ఆయన తనదైన శైలిలో స్పందించాడు. బాలయ్య తన పుట్టిన రోజు సందర్బంగా పాడిన శివ శంకరి పాట తీవ్ర విమర్శల పాలయ్యింది. అద్బుతమైన పాటను అడుక్కుతినే పాటగా మార్చేశాడుగా అంటూ నెగటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. తాజాగా వర్మ కూడా దాదాపుగా అదే అభిప్రాయాన్ని కాస్త విభిన్నంగా తెలియజేశాడు.

బాలయ్య పాట గురించి స్పందించాల్సిందిగా వర్మను కోరిన సమయంలో… ఈ ప్రపంచంలో అద్బుతమైన సింగర్‌ బాలకృష్ణ. పాటలు కనిపెట్టిన తర్వాత అంతటి గాయకుడు ఎవరు పుట్టలేదు. నా తర్వాత సినిమాలో బాలయ్యతో పాడివ్వాలని అనిపించినా కూడా ఆయన స్థాయిలో నేను సినిమా తీయలేను. నా చిన్న సినిమాలో ఆయన్ను పాడమని అడగడం అవివేకం అవుతుంది. ఆయనది ఒక అద్బుతమైన గాత్రం అంటూ చిత్ర విచిత్రమైన కామెంట్స్‌తో బాలయ్య ఫ్యాన్స్‌ను వర్మ రెచ్చగొట్టాడు.


Recent Random Post: