వరుణ్‌ ‘గని’ రిలీజ్ డేట్ గందరగోళం

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న బాక్సింగ్‌ నేపథ్యంలో మూవీ ‘గని’ విడుదలకు సిద్దం అవుతుంది. జులై 30 వ తారీకున ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఎప్పుడో ప్రకటించారు. అందరి కంటే ముందే ఆ తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్‌ సభ్యులకు ఇప్పుడు విడుదల విషయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎదురైంది. అదే రోజున రాధే శ్యామ్‌ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. దాంతో రెండు వారాలు ముందు లేదా తర్వాత అనుకుని గని ఆలోచనల్లో పడ్డారు.

ఇప్పటికే వరుసగా ఆరు నెలల వరకు డేట్లు బుక్ అయ్యాయి. సినిమా ల విడుదల తేదీలు లాక్‌ అవ్వడంతో గని సినిమా ను ఇప్పుడు ఏదో ఒక సినిమా కు పోటీగా విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోటీగా విడుదల చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన కూడా మేకర్స్ లో కనిపిస్తుంది. మెగా హీరో వరుణ్‌ తేజ్ ఆగస్టులో ఎఫ్‌ 3 సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కనుక జులై లేదా జూన్‌ లోనే గనిని తీసుకు రావాల్సి ఉంటుంది. లేదంటే సెప్టెంబర్‌ వరకు సినిమా ను వాయిదా వేయాలని కొందరు సలహా ఇస్తున్నారు. మొత్తానికి గని విడుదల తేదీ విషయం కాస్త గందరగోళంగా మారింది.


Recent Random Post: