మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే మనకు అర్ధమైపోయింది. వరుణ్ తేజ్ ఇందులో బాక్సర్ రోల్ ను పోషిస్తున్నాడు. యువ దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అల్లు బాబీ, సిద్ధూ ముద్దా కలిసి నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే గత కొంత కాలం నుండి గని కి సంబంధించి రకరకాల రూమర్స్ షికార్లు చేస్తూ వస్తున్నాయి. ఈ సినిమా టీమ్ మధ్య విబేధాలు తలెత్తాయని, సినిమాను ఆపేద్దామని కూడా అనుకున్నారని అంటున్నారు. అయితే ఆ విషయంలో ఎలాంటి నిజాలు లేవని తెలుస్తోంది.
తాజాగా చిత్ర టీమ్ ఈ చిత్రం కోసం హాలీవుడ్ స్టంట్ నిపుణులు లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రీఎంబర్గ్ లను తీసుకున్నారు. ఒక భారీ బాక్సింగ్ ఎపిసోడ్ ను వీరి పర్యవేక్షణలో షూట్ చేస్తారు. ఈ ఎపిసోడ్ కోసం ఒక పెద్ద బాక్సింగ్ సెటప్ ను కూడా రెడీ చేస్తున్నారు.
Recent Random Post: