నారప్ప నా కెరీర్ లోనే ఛాలెంజింగ్ క్యారెక్టర్: వెంకటేష్

విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప చిత్రం జులై 20న విడుదలవుతోంది. ఈ చిత్రం ముందు థియేటర్లలో విడుదలవుతుంది అనుకున్నా కానీ ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు ఓటు వేశారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది.

ఈ సందర్భంగా వెంకటేష్ మీడియాతో ముచ్చటించాడు. ఓటిటిలో రిలీజ్ చేయడంతో నా ఫ్యాన్స్ సంతృప్తిగా లేరని తెలుసు కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అదే బెస్ట్ నిర్ణయం. నా ఫ్యాన్స్ చాలా మంచోళ్ళు. త్వరగానే అర్ధం చేసుకుంటారు.

అసురన్ చూసిన వెంటనే ఇది నేను చేయాల్సిన సినిమా అనిపించింది. ఏదైనా సినిమా రీమేక్ చేసినప్పుడు పోలుస్తారు కానీ రీమేక్ చేయడం అనేదే రిస్క్ తో కూడుకున్న అంశంగా భావిస్తాను. నారప్ప నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్. కచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుంది అని తెలిపాడు.


Recent Random Post: