నిన్ను కోరి, మజిలీ చిత్రాలతో దర్శకుడిగా మెప్పించిన శివ నిర్వాణ చేసిన మూడో చిత్రం టక్ జగదీష్ డైరెక్ట్ ఓటిటిలో విడుదలైంది. ఈ సినిమాకు నెగటివ్ రివ్యూలు వచ్చాయి. శివ నిర్వాణ దర్శకుడిగా మరో మెట్టు ఎక్కలేకపోయాడు. అయితే ఈ ఫలితం నుండి త్వరగా బయటపడ్డ ఈ దర్శకుడు తన తర్వాతి చిత్రంపై ఫోకస్ చేస్తున్నట్లు తెలిపాడు.
ఒక మంచి లవ్ స్టోరీ రాస్తున్నట్లు శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చాడు. అయితే విజయ్ దేవరకొండతో గతంలో తన సినిమా ఉంటుందని శివ నిర్వాణ ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం విజయ్ ఇంకా లైగర్ కమిట్మెంట్ తోనే ఉన్నాడు.
ఈ నేపథ్యంలో శివ నిర్వాణ సినిమాపై ఆసక్తి చూపించట్లేదని తెలుస్తోంది. దీంతో శివ వెంకటేష్ తో సినిమా చేయాలని భావిస్తున్నాడు. రీసెంట్ గా వెంకీను కలిసి ఒక లైన్ ను నరేట్ చేసినట్లు సమాచారం.
Recent Random Post: