ఇంటర్వ్యూ: వకీల్ సాబ్ విజయాన్ని దర్శకుడిగా కంటే, అభిమానిగానే ఎంజాయ్ చేస్తున్నాను – వేణు శ్రీరామ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్‘ సినిమా నేడు విడుదలై అటు అభిమానుల నుంచి ఇటు ప్రేక్షకుల నుంచీ యునానిమస్ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ వేణు శ్రీరామ్ స్పెషల్ గా మాతో పంచుకున్న విషయాలు మీకోసం..

ఈ సినిమా సక్సెస్ మీరు ముందే ఊహించారా ?

సినిమా సక్సెస్ అవుతుందని ఎక్సపెక్ట్ చేశాను, కానీ మొదటి షో నుంచే సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ తో, ఈ రేంజ్ లో సక్సెస్ అవుతుందని ఊహించలేదు

వకీల్ సాబ్ రిపోర్ట్ ఫస్ట్ ఎవరి ద్వారా విన్నారు ?

మార్నింగ్, కుకట్పల్లిలో బెనిఫిట్ షో అయిపోయాక ఆడియన్స్, ఫాన్స్ అందరూ నన్ను చుట్టుముట్టి పెద్ద హిట్ కొట్టామని విష్ చేశారు, అప్పుడే అనిపించింది సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ అయ్యిందని.

సినిమా రిలీజ్ తరువాత పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఏంటి?

సినిమా సక్సెస్ పట్ల పవన్ కళ్యాణ్ గారు చాలా ఎమోషన్ అయ్యారు. గట్టిగా హగ్ చేసుకున్నారు. ఒక అభిమానిగా నాకు ఇంకేం కావాలి.?

సినిమా సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?

ముందుగా పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను ఆయన్ని ఎలా చూడాలి అనుకున్నానో అలానే చూపించాను. చాలా హోమ్ వర్క్ చేసి ఆయన క్యారెక్టర్ ను డిజైన్ చేసాను. సినిమా సక్సెస్ ని డైరెక్టర్ గా కాకుండా, ఆయన అభిమానిగా ఎంజాయ్ చేస్తున్నాను, చెప్పాలంటే ఎంజాయ్ అనే దానికంటే గర్వపడుతున్నాను.


Recent Random Post: