నిశ్చితార్థం వార్తలు విని స్వీట్లు తినిపించిన విక్కీ ఫ్యామిలీ!


బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్- కత్రినా మూడేళ్లగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవలే ఈ జంట రహస్యంగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్లు ప్రచారం సాగింది. అంతకు ముందు ఇద్దరు అత్యంత సన్నిహితంగా మెలిగిన ఫోటోలు కూడా లీకయ్యాయి. విదేశీ ప్రయాణాలు.. గోవా బీచ్ సెలబ్రేషన్ అంటూ ఈ జంట మీడియాకి చాలాసార్లు చిక్కింది. కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద కూడా ఇద్దరు జంటగా కనిపించి షాకిచ్చారు. ఆసమయంలో ఇద్దరు ఓకే ప్లాట్ లో కలిసి ఉంటున్నారని కథనాలొచ్చాయి. ఆ కారణంగానే కరోనా సోకింది. ఆ తర్వాత జంటగా వ్యాక్సిన్ వేసుకోవడానికి వచ్చారంటూ మీడియాలో హైలైట్ అయింది. అయితే ఈ కథనాలపై ఇంత వరకూ ఈ జంట స్పందించనేలేదు.

రహాస్యంగా నిశ్చితార్ధం చేసుకున్నారన్న ప్రచారం పీక్స్ కి చేరడంతో `టైగర్ -3` షూట్ ఆన్ సెట్స్ నుంచి కత్రిన వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మా ఇద్దరి మధ్యా అలాంటి రిలేషన్ షిప్ లేదని క్యాట్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాజాగా విక్కీ కౌశల్ సోదరుడు సన్నికుషాల్ ఈ ప్రచారంపై తనదైన శైలిలో స్పందించాడు. “ఈ వార్తలు చూసి తన కుటుంబం నవ్వుకుంద“ని అతడు అన్నాడు. ఆ సమయంలో విక్కీ జిమ్ కి వెళ్లాడు. అతను జిమ్ము నుంచి ఇంటికి రాగానే అతని నోట్లో స్వీట్లు పెట్టి విషయాన్ని చెప్పాం. విక్కీ కూడా చాలా నవ్వాడు. నిశ్చితార్ధం ఊహాజనితం కాబట్టి స్వీట్లు పంచామని సెటైర్ వేసాడు. ఇకపైనా ఇంకెన్ని సార్లు స్వీట్లు తినాల్సి ఉంటుదో! అంటూ నవ్వేసాడు.

అయితే విక్కీ-కత్రినపై అవన్నీ రూమర్లేనా? ఆ జంట సన్నిహితంగా ఉన్న ఫోటోల గురించి గానీ…నైట్ పార్టీల గురించి గానీ..ఒకే అపార్ట్ మెంట్ లో కలిసి ఉంటున్నారన్న విషయంపై కానీ విక్కీ ఫ్యామిలీ స్పందించలేదు. కేవలం మీడియా కథనాల్ని తప్పుబడుతూ సెటైరికల్ గా స్పందించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం విక్కీ కౌశల్ `సామ్ బహదూర్`..`ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ`..`మిస్టర్ లీలే` చిత్రాల్లో నటిస్తున్నాడు. వాటిలో రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. `ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ` పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

కత్రిన కూడా కెరీర్ పరంగా బిజీ బిజీ. టైగర్ 3 రష్యా షెడ్యూల్ ఇటీవల పూర్తి చేసుకుంది. తదుపరి షూటింగ్ కోసం చిత్రబృందం టర్కీకి వెళ్లింది. స్పై థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎమ్రాన్ హష్మి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కత్రినా కొన్ని హై ఆక్టేన్ స్టంట్ లను ప్రదర్శిస్తుందని సమాచారం. అలాగే నటి ప్రియాంక చోప్రా-అలియా భట్ తో ఫర్హాన్ అక్తర్ రోడ్ మూవీ `జీ లే జరా`..లోనూ కత్రిన నటిస్తోంది. అక్షయ్ తో సూర్యవంశీ త్వరలో విడుదలకు రానుంది.


Recent Random Post: