షాకిస్తున్న డిస్నీ ప్లస్.. రౌడీస్టార్ క్రేజీ డీల్

Share

రోజు రోజుకీ మన సినిమాలంటే దేశ వ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోతోంది. మన మార్కెట్ స్టాయి కూడా బాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపడే స్థాయికి చేరుకుంటోంది. ఇటీవల విడుదలైన చిత్రాలన్నీ బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ లు గా నిలవడం.. మన సినిమాలంటే ఉత్తరాది ప్రేక్షకుల్లోనూ భారీ క్రేజ్ ఏర్పడటంతో టాలీవుడ్ మూవీస్ ఇప్పుడు హాట్ కేకులవుతున్నాయి. బిజినెస్ పరంగానూ భారీ ఆఫర్లని దక్కించుకుంటూ ట్రేడ్ పండితుల్ని సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి.

ప్రాంతీయ సినిమా నేషనల్ వైడ్ గా క్రేజ్ ని దక్కించుకుంటున్న తీరు బాలీవుడ్ చిత్రాలని మించి వసూళ్లని రాబడుతున్న విధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా వుంటే తాజాగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూవీ లభించిన క్రేజీ ఆఫర్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం `లైగర్`. సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈమూవీని పూరి జగన్నాథ్ చార్మిలతో పాటు బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ – అపూర్వ మెహతా – హీరూ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్నఈ మూవీ ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంటున్న ఈమూవీ ద్వారా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.

ఆగస్టు 25న వరల్డ్ వైడ్ గా యష్ రాజ్ ఫిలింస్ విడుదల చేయబోతున్న ఈ మూవీ రిలీజ్ కు ముందే బిజినెస్ పరంగా శాటిలైట్ రైట్స్ డిజిటల్ హక్కుల పరంగా సంచలనం సృష్టిస్తోంది. తాజా ఈ మూవీకి సంబంధించిన ఓ హాట్ న్యూస్ నెట్టింటి వైరల్ గా మారింది. ఈ మూవీ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఏకంగా 65 కోట్లు ఆఫర్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ క్రేజీ డీల్ ని `లైగర్` టీమ్ ఫినిష్ చేసినట్టుగా చెబుతున్నారు.

విజయ్ దేవరకొండ మార్కెట్ స్టాయి పెరిగిన విషయం తెలిసిందే. దాదాపు 100 కోట్ల వరకు వసూళ్లని రాబట్టగల సత్తా విజయ్ దేవరకొండ సొంతం. దాంతో పాటు ఈ చిత్రంలో మైక్ టైసన్ కూడా నటించడంతో ఈ మూవీ డిజిటల్ శాటిలైట్ హర్కుల్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ 65 కోట్లకు సొంతం చేసుకుందని తెలిసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగానూ విజయ్ దేవరకొండ కెరీర్లో రికార్డులు సృష్టిస్తున్న ఈ మూవీ రిలీజ్ తరువాత మరెన్ని రికార్టుల్ని తిరగరాస్తుందో చూడాలి.


Recent Random Post: