ప్రస్తుతం టాలీవుడ్‌లో మా ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ప్రకాష్ రాజ్ మొదటగా మా అధ్యక్ష పదవికి పోటీ పడబోతున్నట్లుగా ప్రకటించాడు. ఆ తర్వాత మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ హేమలు కూడా పోటీలో ఉన్నట్లుగా ప్రకటించారు. చివరగా తెలంగాణ కళాకారుల సంక్షేమం కోసం.. చిన్న నటీనటుల సంక్షేమం కోసం తాను పోటీ చేయబోతున్నట్లుగా సీవీఎల్ నరసింహారావు ప్రకటించాడు. మా సభ్యురాలిని కాకున్నా విజయశాంతి ఈ ఎన్నికల పై స్పందించింది.
”మా” ఎన్నికల పై సీవీయల్ నరసింహా రావు అవేదన న్యాయమైనది, ధర్మమైంది. నేను మా సభ్యురాలినీ కాకపోయినా ఒక కళాకారిణి గా స్పందిస్తున్న… చిన్న కళాకారుల సంక్షేమం దృష్టా సీవీయల్ అభిప్రాయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్న అంటూ సోషల్ మీడియా ద్వారా తన మద్దతు తెలిపింది. విజయశాంతి మద్దతుతో సీవీయల్ నరసిహాంహరావు విజయాన్ని సొంతం చేసుకుంటారా అనేది చూడాలి.
''మా'' ఎన్నికల పై సీవీయల్ నరసింహా రావు అవేదన న్యాయమైనది, ధర్మమైంది
నేను మా సభ్యురాలినీ కాకపోయినా ఒక కళాకారిణి గా స్పందిస్తున్న…
చిన్న కళాకారుల సంక్షేమం దృష్టా సీవీయల్ అభిప్రాయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్న…
-విజయ శాంతి pic.twitter.com/cqNsJvw881
— VIJAYASHANTHI (@vijayashanthi_m) June 27, 2021
Recent Random Post: