‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ మనసుకు ఏది అనిపిస్తే అది ముక్కుసూటిగా మాట్లాడుతుంటారనే సంగతి తెలిసిందే. స్టేజి మీద ఇంటర్వ్యూలలో విశ్వక్ అలా మాట్లాడటం చూశాం. ఇటీవల ‘పాగల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యువ హీరో స్పీచ్ పై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ‘సర్కస్ లో సింహంతో ఎవరైనా ఆడుకుంటారు. నేను అడవికి వెళ్లి ఆడుకుని వచ్చే టైప్. ఈ సినిమాతో మూసుకున్న థియేటర్లు కూడా ఓపెన్ అయ్యేలా చేయిస్తా. గుర్తుపెట్టుకోండి. సినిమా మామూలుగా ఉండదు. నా పేరు విశ్వక్ సేన్.. నేను చెప్పింది తప్పైతే పేరు మార్చుకుంటా’ అని విశ్వక్ సేన్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఈ క్రమంలో తాజాగా పాగల్ సక్సెస్ మీట్ లో మరోసారి తనదైన శైలిలో మాట్లాడారు.
“పాగల్ ప్రమోషన్స్ కు ఎక్కువ సమయం లేదు. ఏపీలో 50% ఆక్యుపెన్సీ ఉంది. నైట్ షోలు లేవు. మూడు షో లతోనే రిలీజ్ అయింది. అందుబాటులోను తక్కువ టిక్కెట్ ధరలు ఉన్నాయి. ఇన్ని సమస్యల మధ్య సినిమాని రిలీజ్ చేశాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నా పేరు మార్చుకకుంటా అని చెప్పా. ప్రెస్ మీట్ లో కూడా ఆ మాట వెనక్కి తీసుకుంటా అని చెప్పా. ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ షో నుంచే కొంతమంది నన్ను క్రిందికి లాగడానికి ప్రయత్నించారు” అని విశ్వక్ సేన్ ఎమోషనల్ గా మాట్లాడారు.
”ఎవరు చేశారో నాకు తెలియదు. తెలిస్తే కొంచెం హింట్ ఇవ్వండి. కొంతమంది పనిగట్టుకుని సినిమా బాగాలేదు. యాక్టింగ్ బాగాలేదు. స్క్రీన్ ప్లే బాగాలేదు అని అన్నారు. వాళ్ళ దగ్గరకు వెళ్లి స్క్రీన్ ప్లే నేర్చుకోవాలి. ఇన్ని కష్టాల్లో పాగల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా శని ఆదివారాల్లో కలిపి 6.5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. 100శాతం ఆక్యుపెన్సీతో రిలీజ్ అయిన HIT సినిమా కంటే 30% ఎక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకుంది” అని విశ్వక్ సేన్ తెలిపారు.
‘సినిమా రిలీజ్ కు ముందు అందరి నుంచి సపోర్ట్ కోరుకున్నా. నాకు డైరెక్టర్ సపోర్ట్ చేసింది ఆడియన్స్ మాత్రమే. నేను పేరు మార్చుకుంటే ఎక్కిరిద్దాం లాగేద్దాం అని చాలామంది టెంప్లేట్స్ రెడీగా పెట్టుకున్నారు. సారీ అన్నా. నాకు ఆడియన్స్ కి మధ్య ఎవరూ లేరు. ఈ నాలుగు రోజుల్లో నన్ను ఆడియన్స్ వద్దకు తీసుకెళ్లిన మీడియాకు థాంక్స్” అని విశ్వక్ అన్నారు.
Recent Random Post: