
సినీ పరిశ్రమలో సంబంధాలు, విభేదాలు, చుట్టూ ఉండే వారివల్ల కలిగే సమస్యల గురించి అక్కినేని కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాత అక్కినేని వెంకట్ ఇటీవల బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సీనియర్ జర్నలిస్టు సుబ్బారావుతో ఇంటర్వ్యూలో ఆయన, ఏఎన్నార్ – దాసరి, అలాగే ఏఎన్నార్ – ఎన్టీఆర్ మధ్య జరిగిన విభేదాలపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
వెంకట్ మాట్లాడుతూ –
“మా నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు), దాసరి గారు కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేశారు. కానీ ఎవరైనా మధ్యలో పుల్లలు పెట్టడం వల్లే వారి మధ్య అపార్థాలు వచ్చాయి. ఒకసారి దాసరి గారు మా నాన్నగారి గురించి తప్పుగా మాట్లాడారని తెలిసింది. ఆ తరువాత కాలంలో వారిద్దరినీ కలిపేందుకు నేను కూడా ప్రయత్నించాను” అని గుర్తు చేసుకున్నారు.
అలాగే అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ గురించి మాట్లాడుతూ –
“అప్పట్లో అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేకపోవడంతో, ప్రభుత్వం భూమి పబ్లిక్ పర్పస్ కోసం వాడుకోవచ్చని వాదించింది. నిజానికి మేము అక్కడ అవుట్డోర్ సెట్స్ వేయాలని భావించాము. కానీ నిర్మాణాలు ఆలస్యం కావడంతో ప్రభుత్వం లాక్కోవాలని చూశింది. చివరకు మేము హైకోర్టు వరకు వెళ్లి గెలిచాము” అని తెలిపారు.
ఎన్టీఆర్ – ఏఎన్నార్ సంబంధాలపై ప్రశ్నించగా వెంకట్ సమాధానమిస్తూ –
“వారిద్దరి మధ్య అసలు విభేదాలు లేవు. కానీ ఇండస్ట్రీలో ఎల్లప్పుడూ శకునిలాంటి వారు ఉంటారు. వాళ్లు చేసే పుల్లల వల్లే అలా అపార్థాలు ఏర్పడ్డాయి” అని స్పష్టం చేశారు.
Recent Random Post:















