అఖండ 2లో బాలయ్యకు ప్రత్యర్థిగా సంజయ్ దత్?

Share


గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ప్రధాన పాత్రలో, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ **”అఖండ 2″**పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బాలయ్య శివ తాండవం ఈసారి ఊహాతీతంగా ఉండబోతుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అఖండ ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో, బోయపాటి సీక్వెల్‌ను మరింత గ్రాండిగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఆది పినిశెట్టిని ప్రతినాయక పాత్రకు ఫైనల్ చేశారు. బాలయ్య – ఆది మధ్య భారీ యాక్షన్ సన్నివేశాన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, అసలు ట్విస్ట్ ఇంకొక్కడంటూ ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్ మారింది. తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ను ప్రధాన విలన్‌గా తీసుకొస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రస్తుతం సంజయ్ దత్‌తో బోయపాటి సంప్రదింపులు జరుపుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. దత్ ఎంట్రీ కనుక ఫైనల్ అయితే, అఖండ 2లో విలన్ పాత్ర మామూలుగా ఉండదనేది గ్యారెంటీ. బోయపాటి తన సినిమాల్లో ప్రతినాయకులను ఓ రేంజ్‌లో డిజైన్ చేస్తుంటారు. ఇక సంజయ్ దత్ లాంటి పవర్‌ఫుల్ నటుడితో, బాలయ్యకు పోటీగా ఏ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్ వస్తుందో ఊహించుకోవచ్చు. బాలయ్య – సంజయ్ దత్ మధ్య పోరాటం సినిమాకే హైలైట్‌గా నిలవనుంది.

తెలుగులో సంజయ్ దత్ ఇప్పటివరకు కేవలం రెండు సినిమాల్లోనే నటించారు. 1998లో నాగార్జున హీరోగా వచ్చిన “చంద్రలేఖ”, ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన “జంజీర్” (తుఫాన్) లో కీలక పాత్ర పోషించారు. కేజీఎఫ్ 2లో అదిరిపోయే విలన్ పాత్ర చేసిన దత్, మళ్లీ అఖండ 2లో పవర్‌ఫుల్ నెగటివ్ రోల్ చేయబోతున్నారనే ప్రచారంతో అభిమానుల్లో ఎగ్జైట్‌మెంట్ పెరుగుతోంది.

ఇది నిజమైతే, అఖండ 2లో బాలయ్య – సంజయ్ దత్ పోరు పీక్స్‌లోనే ఉంటుందని చెప్పడంలో సందేహమే లేదు! 🔥🎬


Recent Random Post: