అఖిల్ నెక్స్ట్.. ఈ రిస్క్ అవసరమా?

అక్కినేని హీరో అఖిల్ ఏజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడనే చెప్పాలి. ఈ సినిమా కోసం ఆయన పెట్టుకున్న కష్టం ట్రైలర్ లో స్పష్టంగా కనపడుతోంది. పాపం ఏ సినిమాకీ పడనంత కష్టం పడ్డాడు. తనను తాను మార్చుకున్నాడు. శారీరకంగానూ మానసికంగానూ ఈ సినిమాకు చాలా కష్టపడ్డానని చెప్పాడు.

మొన్నటి వరకు అఖిల్ ని ఏ సినిమాలో చూసినా క్యూట్ గా చిన్నప్పటి సిసింద్రి ఫీలింగే కలిగేది. ఆ మార్క్ ని చెరిపేస్తే వైల్డ్ లుక్ లో ఈ ఏజెంట్ లో దర్శనమిస్తున్నాడు. కేవలం తన శరీరం మార్చుకోవడానికే పది నెలలు పట్టింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే మరో వార్త టాలీవుడ్ లో చెక్కర్లు కొడుతోంది. అదేంటో కాదు.. అఖిల్ తన తదుపరి సినిమాకి ఒకే చెప్పేశాడట.

అది కూడా ఓ కొత్త దర్శకుడితో కావడం విశేషం. రాధేశ్యామ్ సాహో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అరుణ్ అనే కొత్త డైరెక్టర్ తో అఖిల్ తదుపరి చిత్రం ఉండనుందట. ఇప్పటికే అరుణ్ అఖిల్ ని కలిసి తన స్టోరీ చెప్పాడట. అది నచ్చేయడంతో అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఏజెంట్ రిలీజ్ తర్వాత ఓ మంచి రోజు చూసుకొని ఈ సినిమాను ఎనౌన్స్ చేయనున్నారట. ఈ సినిమాకి యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూసర్ లు గా వ్యవహరించనున్నారు. అయితే సాహో రాధేశ్యామ్ లు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. ప్రభాస్ హీరో అయినా జనాలు ఆ సినిమాలను రిజెక్ట్ చేశారు. మరి ఆ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. మరి కథలో ఏం నచ్చి అఖిల్ ఒకే చేశాడో తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా ఏజెంట్ మూవీలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసిన ఈ సినిమా స్పై థ్రిల్లర్ జోన్ లో తెరకెక్కించారు. ఈ మూవీలో మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా నటించడం విశేషం.


Recent Random Post: