అఖిల్ పెళ్లి ఫోటోలకు అభిమానుల ఎదురు చూపు!

Share


యంగ్ హీరో అక్కినేని అఖిల్ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. జూన్ 6న తన ప్రేయసి జైనాబ్‌ను ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో వివాహం చేసుకుని మెరేజ్ లైఫ్‌కి అడుగుపెట్టారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య సింపుల్‌గా జరిగిన ఈ పెళ్లి తర్వాత, నాగార్జున ఒక గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు.

ఈ రిసెప్షన్ వేడుకకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ నేతలు, ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలు నాగార్జున, అమల, నాగచైతన్య, శోభిత సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు.

అయితే హీరో అఖిల్ మాత్రం ఇప్పటివరకు తన పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఏవీ సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. గతంలో జైనాబ్‌తో కలిసి ఉన్న కొన్ని ఫొటోలు మాత్రమే అతని ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నప్పటికీ, వివాహ ఫొటోలు మాత్రం ఇప్పటివరకు పోస్ట్ చేయలేదు. దీంతో అఖిల్ అభిమానులు అతడి నుంచి పెళ్లి ఫొటోల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం అఖిల్ “లెనిన్” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా షూటింగ్ జరగుతుండగా, అఖిల్ సినిమా పోస్టర్‌ను మాత్రమే ఇన్‌స్టాలో షేర్ చేశాడు. కానీ పెళ్లికి సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచాలనే ఉద్దేశ్యంతో ఫొటోలు పంచుకోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇకనైనా అఖిల్ తన పెళ్లి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటాడా? అన్నదే ఇప్పుడు అక్కినేని అభిమానుల్లో హాట్ టాపిక్.


Recent Random Post: