అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ పైన నిజాలు వెల్లడి

Share


ఒకే హీరోయిన్ని రెండు వేరియంట్ లుగా చూడాల్సి వస్తే అది అనుపమ పరమేశ్వరన్ మాత్రమే. ప్రేమమ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనుపమ, తన నటనతో మంచి క్రేజ్ సంపాదించింది. యువ హీరోలతో పాటు టైర్ 2 హీరోలతో కూడా అనుపమ జత కడుతూ, ప్రతి పాత్రకు న్యాయం చేసేది ఆమె. అయితే, ఆశించినంత పెద్ద పాపులారిటీ అందుకోలేకపోయింది. గ్లామర్ షోలకు దూరంగా, మంచి పాత్రల ద్వారా తన ప్రత్యేక గుర్తింపును సంపాదించింది అనుపమ.

కానీ స్లిమ్ అయ్యాక అనుపమ పూర్తిగా వేరే మారు రూపంలో కనిపించింది. గ్లామర్ షోతో ఫోటోషూట్స్ మాత్రమే కాకుండా, టిల్లు స్క్వేర్ సినిమాలో తన లిప్ లాక్, స్కిన్ షోతో నెటిజన్లను షాక్ చేసింది. టిల్లు స్క్వేర్ సినిమా గురించి అనుపమ తన మనసులో ఉన్న మాటలను ఓపెన్ గా చెప్పింది. ఫ్యాన్స్ ఆ రోల్ నచ్చలేదని తెలుసుకోవడం ఆమెకి స్పష్టమే. సినిమా చేయడానికి చాలా కాలం ఆలోచించినప్పటికీ, ఈ పాత్ర చేస్తే తప్పేమి లేదని తాను అనుకుంది.

అయితే, ఆ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఆ రోల్ చేయడం కాస్త కష్టం అయింది. అందుకే, 100% కాన్ఫిడెంట్ గా ఆ పాత్ర చేయలేకపోయానని అనుపమ తెలిపింది. సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా అలాంటి డ్రెస్సుల్లో ఉండటం సౌకర్యంగా అనిపించలేదు. అయితే, దాన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని చేసింది. ఆ పాత్రతో ప్రేక్షకులు ఏమనుకుంటారనే సందేహం ఉన్నా, పాత్ర చాలా స్ట్రాంగ్ అని భావించి చేసింది అనుపమ.

టిల్లు స్క్వేర్ రిలీజ్ తర్వాత, హీరోకి ఈక్వల్‌గా ఉన్నట్లు విమర్శకులు వ్యాఖ్యానించడంతో, ఇలాంటి పాత్రలను వదిలిపెట్టను అనుకున్నట్లు చెప్పారు. సినిమా చేయడానికి ఫిక్స్ అయినప్పుడే విమర్శలకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసింది.

మొత్తానికి, అనుపమ పరమేశ్వరన్ తన టిల్లు స్క్వేర్ పై ఒపినియన్లను స్వేచ్ఛగా పంచుకుంది. అలాగే, హీరోయిన్ గా ఏదైనా మాట్లాడితే ఆమెకి యాటిట్యూడ్ అంటారనే అనుభవాన్ని కూడా పంచుకుంది. ప్రస్తుతం ఆమె పరదా సినిమా చేశారు, ఇది ఆగస్టు 22న విడుదలవుతుంది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ఈ సినిమా ద్వారా అనుపమ మళ్లీ తన మెరుగైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్దపడుతోంది.


Recent Random Post: