
ఎవరి జీవితం ఎప్పుడు, ఎలాంటి మలుపు తీరుతుందో ముందే చెప్పలేం. జీవితంలో ఏదీ ప్లాన్ చేసుకోలేనిది అని అంటోంది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. జీవితం ఊహించని మలుపులు తీసుకుంటుందని, అది మనల్ని ఎవరూ ఊహించని ప్రదేశాలకు తీసుకెళ్తుందని ఆమె చెప్పింది. తన కెరీర్ విషయంలో కూడా ఆమె ఇమాజినేషన్ కంటే ఎక్కువ జరిగిందని కొత్త సినిమా ‘బైసన్’ ప్రమోషన్స్లో తెలిపింది.
కెరీర్ ప్రారంభంలో ఒక మంచి సినిమాలో నటించాలని అనుకున్న అనుపమ, గడిచిన 10 ఏళ్లలో అనేక మంచి క్యారెక్టర్లను అందుకుంది. ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె డ్రాగన్, జానకీ వర్సస్ స్టేట్ ఆఫ్ కేరళ, పరదా, కిష్కిందపురి సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. ఈ నాలుగు సినిమాలు నాలుగు విభిన్న కథలను ప్రతిబింబిస్తున్నాయి.
ఇక ఈ ఏడాది ఆమె ఐదో సినిమా కూడా రాబోతోంది. చియన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా నటించిన బైసన్ రేపు థియేటర్లలోకి వస్తుంది. సినిమా గురించి అనుపమ కొన్ని ఆసక్తికరమైన వివరాలను షేర్ చేసింది. ఈ సినిమా డైరెక్టర్ మారి సెల్వరాజ్తో గతంలో ఆమె పెరియేరుమ్ పేరుమాల్ అనే తమిళ సినిమాను మిస్ అయ్యింది. కొన్నేళ్ల నిరాశ తర్వాత, ఇప్పుడు అదే డైరెక్టర్‌తో బైసన్ లో నటించే అవకాశం దక్కించుకుంది.
అనుపమ మాట్లాడుతూ, “నేను ప్రేమమ్ చేసినప్పుడు సినిమా గురించి ఏమీ తెలియదు. ప్రతిదీ కొత్తగా, మాయాజాలంలా అనిపించింది. ఇప్పుడు పదేళ్ల తర్వాత, ‘బైసన్’ ఫొటోషూట్ సమయంలో కూడా అదే ఫీల్ అయింది,” అని చెప్పింది.
ఈ విధంగా, తన పదేళ్ల కెరీర్‌ను సింపుల్‌గా వివరించిన అనుపమ, ఇప్పుడు ‘బైసన్’ విడుదలకు పూర్తిగా రెడీగా ఉన్నది. రేపు థియేటర్లలో రిలీజ్ అయినప్పటికీ, ఆమెలో ఎలాంటి ఆందోళన, భయం కనిపించడంలేదు. ఫలితం ఏదైనా స్వీకరించడానికి తానే సిద్ధమని ఆమె చూపిస్తుంది. ఈ క్రమంలో విథి తనను ఊహించని ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్లిందని అనుపమ చెప్పింది.
Recent Random Post:















