అప్పుడు షారూక్ కు నిర్బంధం ఇప్పుడు అంబాసిడర్తో భేటీ

బండ్లు ఓడలు అవుతుంటాయి.. ఓడలు బండ్లు అవుతుంటాయి.. అని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. ఒకప్పుడు పరిస్థితులు అనుకూలించకా ఇబ్బందులు కష్టాలు పడ్డవారు.. ఆ తర్వాత ఉన్నతంగా జీవిస్తారని అంటారు. ఈ సామెతలు నీతి వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ జీవితంలో నిజం అయ్యాయి. ఒకప్పుడు నిర్బంధించిన అధికారులే ఇప్పుడు ఇంటికి వచ్చి మరీ ఆతిథ్యం స్వీకరించారు

షారూక్ ఖాన్ గురించి ఆయన స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత దేశ వ్యాప్తంగా ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. షారూక్ సినిమాలు భారత్ తో పాటు వివిధ దేశాల్లోనూ రిలీజ్ అవుతుంటాయి. అమెరికా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షారూక్ సినిమాలు దాదాపు అన్నీ యూఎస్ లోనూ విడుదల అవుతుంటాయి.

షారూక్ కు అమెరికాలో కూడా అభిమానులు ఉంటారన్న సంగతి తెలిసిందే. కింగ్ ఖాన్ ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ ఎగబడుతుంటారు. సినిమా షూటింగ్ లకు పర్సనల్ టూర్ల కోసం చాలా సార్లు షారూక్ ఖాన్ అమెరికా వెళ్తుంటారు. అలా వెళ్లిన చాలా సార్లు షారూక్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది.

షారూక్ ఖాన్ ను అమెరికా ఎయిర్ పోర్టుల్లోని భద్రతా సిబ్బంది నిర్భంధించారు. ఇలా ఒక్కసారి కాదు ఏకంగా మూడు సార్లు ఇలా డిటైన్ చేశారు. 2009 2012 2016లో యూఎస్ ఎయిర్పోర్టు ల్లో షారూక్ ఖాన్ను నిర్బంధించారు. ఇలా మూడు సార్లు జరగడం పట్ల అప్పట్ లో షారూక్ ఖాన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు కూడా. ‘సెక్యూరిటీ సిబ్బంది బాధ్యతలను నేను పూర్తిగా అర్థం చేసుకుంటాను. కానీ ఇలా ప్రతీసారి నన్ను ఎయిర్ పోర్టుల్లో నిర్బంధించడం చాలా అసౌకర్యంగా ఉంది’ అంటూ 2016 లో షారూక్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

కట్ చేస్తే.. 2023 సంవత్సరం మే 16వ తేదీన యూఎస్ అంబాసిడర్ ఎరిక్ గార్శెట్టి స్వయంగా షారూక్ నివాసం అయిన మన్నత్ కు వెళ్లాడు. అక్కడ షారూక్ తో కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం తర్వాత యూఎస్ అంబాసిడర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ షారూక్ ను కలవడం చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశాడు.

చాలా విషయాలు చర్చించినట్లు వెల్లడించాడు. ఒకప్పుడు ఎయిర్పోర్టులో నిర్బంధించిన అధికారులు ఇప్పుడేమో ఇంటికి వచ్చి మరీ ఆతిథ్యాన్ని స్వీకరించిన దేశ ప్రతినిధి.. అప్పటి పరిస్థితి ఇప్పటి పరిస్థితి పోలుస్తూ నెటిజన్లు షారూక్ ను కీర్తిస్తున్నారు.


Recent Random Post: