అభినయ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వేగేశ్న కార్తీక్‌తో మార్చి 9న ఆమెకు నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి వరకు తన కాబోయే భర్తను గోప్యంగా ఉంచిన అభినయ, ఎంగేజ్మెంట్ సందర్భంగా కేవలం దేవాలయంలో గంట కొడుతున్న ఫోటోను మాత్రమే షేర్ చేసింది. అయితే, ఇప్పుడు తన భర్తను అధికారికంగా అందరికీ పరిచయం చేస్తూ, సోషల్ మీడియాలో తమ ఫోటోలను పోస్ట్ చేసింది.
కార్తీక్, అలియాస్ సన్నీ వర్మ, ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరొందాడు. భీమవరం ప్రాంతానికి చెందిన సన్నీ, తెలుగు రాష్ట్రాల్లో పలు వ్యాపారాలకు అధిపతిగా ఉన్నాడు. మొదట స్నేహంగా మొదలైన వారి బంధం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి దిశగా సాగుతోంది.
అభినయ, ‘శంభో శివ శంభో’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసినా, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో మహేష్ బాబు చెల్లిగా నటించిన పాత్ర ద్వారా ప్రేక్షకులకు బాగా గుర్తింపు వచ్చింది. జన్మతః చెవిటి, మూగ అయినప్పటికీ, అభినయ తన ప్రతిభతో నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
త్వరలోనే వీరి పెళ్లి భీమవరం లేదా చెన్నైలో వైభవంగా జరగనున్నట్లు సమాచారం. నిశ్చితార్థం అనంతరం అభినయ తన కాబోయే భర్తను పరిచయం చేయడంతో, అభిమానులు, సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Recent Random Post:















