
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అవికా గోర్, ప్రేక్షకుల హృదయాలను గెల్చుకుంది. సీరియల్ తర్వాతే ఆమె ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా అడుగుపెట్టింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడం వల్ల రాజ్ తరుణ్‌కు మాత్రమే కాక, అవికా గోర్ కెరీర్‌కి కూడా పెద్ద ప్లస్ అయ్యింది.
ఆ సినిమా ద్వారా వచ్చిన గుర్తింపుతో అవికా వెంటనే లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది-3, పాప్ కార్న్, ఉమాపతి వంటి సినిమాల్లో నటించింది. అలాగే, కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌లో కూడా పాల్గొని తన ప్రతిభను చూపించింది.
ఇప్పుడు, ఈ ముద్దుగుమ్మ తాజాగా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. అవికా గోర్ గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానీతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈ ఏడాది జూన్‌లో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవికా గోర్ తన పెళ్లి డేట్‌ను వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ, “మేమిద్దరం సెప్టెంబర్ 30న పెళ్లి చేసుకోబోతున్నాం” అని ప్రకటించింది. అలాగే, “ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ, అన్నివేళలా నాతో ఉండే భాగస్వామిని పొందినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఓ అదృష్టవంతుడిని పెళ్లి చేసుకోబోతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను” అని చెప్పారు.
అవికా గోర్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ, “2008 నుండి నేను ప్రేక్షకుల ముందునే ఉన్నాను. నా సినీ కెరీర్లో ప్రేక్షకులు నాకు ఎంతో మద్దతు ఇచ్చారు. వారు కూడా నా ఈ వివాహ బంధంలో భాగం కావాలనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని చెప్పాను. చిన్నతనంలో నేను నా పెళ్లి గురించి ఎన్నో కలలు కనేవాడిని. ఇప్పుడు ఈ కొత్త అధ్యాయంతో నా చిన్ననాటి కల నెరవేరుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది” అని చెప్పారు.
అవికా-మిలింద్ జంట 2020లో మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకొని, ఫ్రెండ్షిప్ నుంచి ప్రేమకు, తర్వాత పెళ్లికి అడుగుపెట్టింది. మరోవైపు, అవికా గోర్ నటించిన పతి పత్ని పంగా వెబ్ సిరీస్ కూడా త్వరలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
Recent Random Post:















