ఆర్జీవీకి ‘ధురంధర్’ జోష్.. కొత్త ప్రారంభం?

Share


విలక్షణ దర్శకుడు Ram Gopal Varma తన పుట్టినరోజును ముంబైలో సినీ ప్రముఖుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కేక్ కట్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ “నా గతాన్ని #ధురంధర్2 అనే కత్తితో పొడుస్తున్నాను” అని పేర్కొనడం విశేషం.

బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన ధురంధర్: ది రివెంజ్ ఇచ్చిన ఉత్సాహంతో, గత వైఫల్యాలను పక్కన పెట్టి కొత్త ప్రయాణం ప్రారంభించాలనే సంకేతాలను వర్మ ఇచ్చినట్లు కనిపిస్తోంది.

ఇక ఈ వ్యాఖ్యలకు Kangana Ranaut నుండి ఆసక్తికరమైన మద్దతు లభించింది. తన చిన్ననాటి రోజుల్లో హిమాచల్ ప్రదేశ్‌లో థియేటర్లు లేకపోయినా వర్మ సినిమాల డీవీడీలు తెప్పించుకుని చూసేదాన్నని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ సినిమాలే తనను ముంబైకి, సినిమా రంగానికి తీసుకువచ్చాయని చెప్పడం విశేషం.

గత కొంతకాలంగా వరుసగా నాణ్యతలేని చిత్రాలతో విమర్శలు ఎదుర్కొన్న వర్మకు, కంగనా వంటి నటీమణుల ప్రోత్సాహం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తన సినిమాలు ప్రేక్షకులపై చూపిన ప్రభావాన్ని గుర్తుచేసుకుంటూ, మళ్లీ పాత ఫామ్‌లోకి రావాలనే పట్టుదలతో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

కంగనా వ్యాఖ్యలకు వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ, ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా మరిన్ని గొప్ప చిత్రాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

మొత్తానికి, ధురంధర్ సక్సెస్‌తో పాటు కంగనా ఇచ్చిన నైతిక మద్దతు వర్మలో కొత్త జోష్ నింపినట్టుగా కనిపిస్తోంది. గతాన్ని వెనక్కి నెట్టి, విజయాల వైపు మరోసారి పయనించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.


Recent Random Post: