ఆర్య ఇంటిపై ఐటీ దాడులు – సీ షెల్ లావాదేవీలపై పరిశీలన

Share


కోలీవుడ్ నటుడు ఆర్య ఇంటిపై బుధవారం ఉదయం నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. కేవలం ఆయన నివాసం మాత్రమే కాదు, అతనితో సంబంధాలున్నాయని భావిస్తున్న సీ షెల్ రెస్టారెంట్ బ్రాంచ్‌లలోనూ ఈ దాడులు కొనసాగుతున్నాయి. చెన్నైలోని అన్నానగర్, వెలాచేరి సహా పలు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేశారు.

ఉదయం 8 గంటలకే అన్నానగర్‌లో ఉన్న సీ షెల్ రెస్టారెంట్‌లో దాడులు ప్రారంభమయ్యాయి. పటిష్ట భద్రత మధ్య అధికారులు సోదాలు జరిపారు. ఈ ఘటన ప్రస్తుతం చెన్నై సినీ, వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ట్యాక్స్ ఎగవేత నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయని సమాచారం.

గతంలో ఆర్య సీ షెల్ అనే అరేబియన్ రెస్టారెంట్ చైన్ ప్రారంభించాడు. కానీ తరువాత కేరళకు చెందిన వ్యాపారవేత్త కున్హి మూసాకు వాటిని విక్రయించినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే కున్హి మూసా ఆస్తులపై ఐటీ శాఖ దర్యాప్తు జరుపుతోంది. ఆ దర్యాప్తులో భాగంగా చెన్నైలోని రెస్టారెంట్లు, ఆర్య నివాసంపై దాడులు జరిగాయని సమాచారం.

ఆర్య తాను ఆ రెస్టారెంట్లను అమ్మేశానని చెబుతున్నా, ఇంకా వాటితో ఆయనకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ దాడులపై ఆర్య స్పందించినట్టు సమాచారం. తనకు ఇప్పుడు సీ షెల్‌తో ఎలాంటి సంబంధం లేదని స్థానిక మీడియాతో చెప్పినట్టు తెలుస్తోంది. ఐటీ అధికారులు దాడులు ముగించిన తర్వాత అధికారిక సమాచారం విడుదల చేసే అవకాశం ఉంది.


Recent Random Post: