
కన్నడ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్ మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. తెలుగులో అమిగోస్, నా సామి రంగ సినిమాలతో కనిపించినా, ఆ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తిరిగి కన్నడలో బిజీ అయింది. ఇప్పుడు మళ్లీ విశ్వంభర సినిమాతో టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో త్రిష ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఆషికా సెకండ్ హీరోయిన్గా కనిపించబోతోందని సమాచారం. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ సినిమా అక్టోబర్ లేదా నవంబర్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం సినిమా VFX పనులు చివరి దశలో ఉన్నాయని వశిష్ట ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాలో తన పాత్రపై ఆషికా చాలా నమ్మకంగా ఉందని టాక్.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆషికా తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. స్కిన్ షో లేకుండానే పద్దతిగా ఉండే డ్రెస్‌లలో అందంగా మెరవడం ఆమె ప్రత్యేకత. ఈమధ్య ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వెనుక నుంచి వైట్ పంజాబీ డ్రెస్‌లో నడుము అందం చూపిస్తూ ఇచ్చిన పోజులు నెటిజన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. “నా సామిరంగ ఏం అందం” అంటూ కామెంట్లు చేస్తున్నారు. సింపుల్ లుక్‌లోనే ఆమె గ్లామర్ ఓ రేంజ్లో ఉందని నెటిజన్స్ అంటున్నారు.
చాల తక్కువ సమయంలోనే ఆషికా అనేక సినిమాలు చేసి, ఆకట్టుకునే అందం, సహజమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సింపుల్ పాత్రలకు ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. అందుకే ఫిల్మ్ మేకర్స్ వరుసగా ఆమెను తమ ప్రాజెక్ట్స్‌లో తీసుకుంటున్నారు. భవిష్యత్తులో టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారడం ఖాయమనే చెప్పాలి.
1996 ఆగస్టు 5న కర్ణాటకలోని తుమకూరులో జన్మించిన ఆషికా, చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. బెంగళూరులో జ్యోతి నివాస్ కాలేజ్‌లో చదువుతున్న రోజుల్లో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగళూరు కాంటెస్ట్‌లో రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత డాన్స్, యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకొని, త్వరగానే కన్నడ సినిమాల్లో అవకాశాలు అందుకుంది. అక్కడి స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ కెరీర్‌ను విస్తరిస్తోంది.
Recent Random Post:















