ఆస్కార్ గ్రహీతల సన్మానంపై నట్టి కుమార్ సంచనల వ్యాఖ్యలు!

ఆస్కార్ అవార్డు గ్రహీతల్ని నిన్నటి రోజున శిల్పాకళావేదికలో తెలుగ చలన చిత్ర పరిశ్రమ తరుపున సన్మానించిన సంగతి తెలిసిందే. ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది. తాజాగా ఈ వేడుకపై నిర్మాత నట్టి కుమార్ అసంతృప్తిని వ్యక్తం చేసారు. `ఆర్ ఆర్ ఆర్` చిత్ర నిర్మాత డి.వి.వి దానయ్య లేకుండా అభినందన సభ ఏర్పాటు చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఆస్కార్ గ్రహీతల్ని అంత అర్జెంట్ గా ఎవరికీ తెలియకుండా ఎందుకు సన్మానించారని ప్రశ్నించారు.

తెలుగు సినిమాకి అస్కార్ రావడం అందరూ గర్వించదగ్గ విషయం. కానీ ఆస్కార్ గ్రహీతలకు సరైన గౌరవం దక్కలేదు. నిన్న జరిగిన ఈవెంట్ కి ఏపీ ప్రభుత్వ పెద్దలు రాలేదు. కేవలం సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చారు. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ..ఏపీ ప్రభుత్వాలతో ఎందుకు సంప్రదించలేదు. నిన్నటి ఈవెంట్ గురించి చాలా మందికి ఎలాంటి సమచారం కూడా లేదు.

సన్మానించడంలో తప్పులేదు. కానీ ఇది సరైన పద్దతి కాదు. ఈసీ అప్రూవల్ లేకుండా ప్రోడ్యూసర్ కౌన్సిల్ నుంచి 25 లక్షలు ఎలా ఖర్చు చేస్తారు? తెలంగాణ వచ్చాక సినీ పరిశ్రమకి అది చేస్తాం. ఇది చేస్తామని కబుర్లు చెప్పారు మంత్రి శ్రీనివాస గౌడ్ కానీ చిన్న సినిమాలకు ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు అందించలేదు. పెద్ద సినిమాలకు మాత్రమే గుర్తింపు వస్తుంది. చిన్న సినిమాలకు ఐదో షో కావాలని అడుగుతున్నాం. ఈ అంశాన్ని పట్టించుకునే వారే లేరు.

తెలంగాణలో ఎక్కువ లాభాలు వస్తున్నాయని శ్రీనివాస గౌడ్ అన్నారు. కానీ ఇక్కడ 32 శాతం..ఏపీలో 62 శాతం లాభాలు వస్తున్నాయి. అయినా చాలా కంపెనీలు తెలంగాణలోనే జీఎస్టీ కడుతున్నాయి. సినీ పరిశ్రమలో ఏపీ-తెలంగాణ అంటూ ఎలాంటి విబేధాలు లేవు. అందరం కలిసే ఉన్నాం. కానీ కొందరు నాటకాలతో ఈ విధానం తప్పు దారి పడుతుందని` అని అన్నారు.

దీంతో నట్టి కుమార్ వ్యాఖ్యలు పరిశ్రమ సహా ప్రజల్లో హాట్ టాపిక్ గా మారాయి. పరిశ్రమ నుంచి స్టార్ హీరోలెవరు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. వాళ్లకి ఆహ్వానం అంది రాలేదా? అందక రాలేదా? అన్న దానిపై మీమాంస ఉండేది. తాజాగా నట్టి వ్యాఖ్యలతో కొత్త సందేహాలకు తావిచ్చినట్లు అవుతుంది.


Recent Random Post: