ఇంట్రెస్టింగ్ ‘ఇండియా లాక్ డౌన్’ టీజర్

2020 సంవత్సరం ఆరంభంలో ఇండియా లో కరోనా కల్లోలం మొదలు అయ్యింది. ప్రపంచ దేశాలు అన్నీ కూడా భయబ్రాంతులకు గురి అయిన సమయంలో ఇండియాలో కూడా అనూహ్యంగా ముందస్తు ప్రకటన లేకుండా కరోనా కేసులు భారీ ఎత్తున పెరుగుతున్నాయి అంటూ కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ విధించిన విషయం తెల్సిందే.

ఇండియన్ చరిత్రలో లాక్ డౌన్ అత్యంత దారుణమైన సంఘటనగా నిలిచి పోతుంది. లక్షలాది మంది వలస కార్మికులు.. రోజూ వారి కూలీలు బిక్కు బిక్కు మంటూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాక్ డౌన్ వల్ల వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అత్యంత దారుణమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు.

వ్యాపారస్తులు.. కూలీలు.. వేశ్యలు ఇలా ప్రతి ఒక్కరు కూడా లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ విషయాలను చూపిస్తూ లాక్ డౌన్ అనే చిత్రంను బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ తెరకెక్కించడం జరిగింది.

ఈ సినిమా లో శ్వేత బసు ప్రసాద్.. ప్రతీక్ బబ్బర్.. సాయి తమంకర్.. ప్రకాష్ బెలవాడి లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. డిసెంబర్ 2 న జీ 5 లో స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ సినిమా కు సంబంధించిన టీజర్ ను విడుదల చేయడం జరిగింది. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది అంటూ ప్రముఖుల నుండి కామెంట్స్ దక్కించుకుంది.

బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా ఇప్పటికే కరోనా మరియు లాక్ డౌన్ నేపథ్యం లో సినిమా లు వచ్చాయి. అయితే ఈ సినిమా ఎమోషనల్ గా ప్రతి ఒక్కరిని కదిలించే విధంగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమా ను పెన్ స్టూడియోస్ బ్యానర్ లో జయంతి గడ్డ నిర్మిస్తున్నారు.


Recent Random Post: