
ఇలియానా డి క్రజ్ పరిచయం అవసరం లేదు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఇలియానా, తన భర్త మైఖేల్ డోలన్‌తో కలసి ఇటీవల రెండవ బిడ్డకు జన్మనిచ్చిన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. రెండోసారి కూడా కొడుకు పుట్టాడు. రెండవ కొడుకుకు కీను రాఫే డోలన్ అని పేరు పెట్టారు. ఇప్పటికే మొదటి కొడుకు కోవా ఫీనిక్స్ డోలన్‌తో తల్లిగా మారింది.
38 ఏళ్ల ఇలియానా తన ప్రసవానంతర అనుభవాల గురించి వివరించింది. రెండవ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు మానసికంగా ఇబ్బందిపడ్డట్లు, స్నేహితుల నుండి దూరంగా ఉండటం వల్ల మద్దతు పొందలేకపోయినట్లు తెలిపింది. మొదటి బిడ్డ కోసం ప్రయత్నిస్తూనే, ఒంటరి మహిళగా ఉండటాన్ని అనుభవించాల్సి వచ్చింది. తరువాత, బిడ్డ ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టింది. అయితే రెండవ బిడ్డ పుట్టిన తర్వాత మానసిక పరిస్థితి పూర్తిగా మారి, గందరగోళంలో పడిపోయినట్లు తెలిపారు.
భారతదేశం నుంచి బయటకు వెళ్లిన ఇలియానా ముంబైని మిస్ అవుతున్నానని, అక్కడ తన స్నేహితుల మద్దతు ఉన్నా కూడా అందరినీ మిస్ చేస్తున్నానని చెప్పారు. ఇలియానా – మైఖేల్ 2023లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు, భర్తతో కలిసి విదేశాల్లో నివసిస్తున్నారు.
కెరీర్ విషయానికి వస్తే, 2024లో విడుదలైన దో ఔర్ దో ప్యార్ చిత్రంలో ఇలియానా నటించింది. ఈ సినిమాలో విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ, సెంధిల్ రామమూర్తి తదితరులు కూడా నటించారు. ఆ తర్వాత ఇప్పటివరకు సినిమాల్లో కనిపించలేదు. ఇలియానా తన కెరీర్‌లో రీఎంట్రీ ఇవ్వాలంటే, పిల్లలు పెద్దవాళ్లుగా అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడాలి.
Recent Random Post:














