గోవా బ్యూటీ సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. సౌ లోత్ మొదటి కోటి రూపాయల పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా ఇలియానా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఆమె క్రేజ్ కి ఆ పారితోషికం నిదర్శణంగా చెప్పుకునే వారు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే బాలీవుడ్ లో అడుగు పెట్టింది.
బాలీవుడ్ లో దాదాపుగా నాలుగు అయిదు సంవత్సరాల పాటు సందడి చేసింది. అక్కడ ఏకంగా స్టార్ హీరోలతో సినిమాలను చేసే అవకాశాలు దక్కించుకోవడంతో పాటు, అవార్డ్ విన్నింగ్ సినిమాల్లో కూడా భాగస్వామ్యం దక్కించుకుంది. అలాంటి ఇలియానా అక్కడ అనుకున్నంత కాలం మనుగడ సాగించలేక పోయింది.
చాలా తక్కువ సమయంకే అక్కడి ప్రేక్షకులకు మరియు ఫిల్మ్ మేకర్స్ కి ఇలియానాపై ఆసక్తి తగ్గిందని చెప్పాలి. బాలీవుడ్ లో ఆఫర్లు తగ్గడంతో సౌత్ లో సినిమాలు చేసేందుకు ఇలియానా ఆసక్తి చూపించింది. కానీ ఇక్కడ కూడా పెద్దగా ఆమె పై ఆసక్తి చూపించిన ఫిల్మ్ మేకర్స్ లేరు. దాంతో వైవాహిక జీవితంలో అడుగు పెట్టాలని నిర్ణయానికి వచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి తల్లి కూడా అయింది. గర్బవతి అంటూ ప్రకటించిన ఇలియానా తన భర్త గురించి క్లారిటీ ఇవ్వలేదు. తల్లి అయిన తర్వాత ఇలియానా తన భర్తను ప్రకటించింది. ఇక ఇలియానా గురించి గత కొన్ని రోజులుగా ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
సాధారణంగా హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో తల్లి అయిన తర్వాత కూడా హీరోయిన్ గా కొనసాగుతూ ఉన్నారు. కాజల్ తో పాటు మరి కొందరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా నటిస్తున్నారు. అయితే ఇలియానా కి మాత్రం ఆ ఆసక్తి లేనట్లు తెలుస్తోంది. అందుకే సినిమాలకు ఇలియానా గుడ్ బై చెప్పబోతుందనే వార్తలు వస్తున్నాయి.
ఆ వార్తలపై క్లారిటీ రాకుండానే మరో పుకారు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమాలకు మాత్రమే కాకుండా ఇండియాకి కూడా ఇలియానా గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఇలియానా పెళ్లి చేసుకున్న వ్యక్తి అమెరికా పౌరుడు. అందుకే అక్కడ సెటిల్ అవ్వాలనే నిర్ణయానికి ఇలియానా వచ్చిందట. ఈ విషయమై ఇలియానా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
మొత్తానికి ఇండియన్ సినీ రంగంలో ఇలియానా ప్రస్థానం ముగిసినట్లే అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. భవిష్యత్తులో మళ్లీ ఇలియానా సెకండ్ ఇన్నింగ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఈమె ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇంతకు ఇలియానా అభిప్రాయం ఏంటో తెలియాల్సి ఉంది.
Recent Random Post: