
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఆయన మేనత్త దగ్గుబాటి పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆమె ఎన్టీఆర్‌తో తన అనుబంధం గురించి వెల్లడించారు.
ఎన్టీఆర్‌తో మీ బంధం ఎలా ఉంటుందనే ప్రశ్నకు స్పందించిన పురంధేశ్వరి, “అతను నన్ను అత్తగా ఎంతో గౌరవిస్తారు. నా కొడుకు, నివేదితాతో ఎన్టీఆర్ క్రమం తప్పకుండా టచ్‌లో ఉంటూ వీడియో కాల్స్ చేస్తుంటారు. తనకు నేను ఎంతో ప్రియమైన వ్యక్తిని,” అని చెప్పుకొచ్చారు.
అలాగే, సినిమాల విషయంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌కు ఎలాంటి సూచనలు ఇవ్వను అని స్పష్టం చేశారు. ఇప్పటికే వారు తమ ప్రతిభతో సినీ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారని, అయితే, చేసిన సినిమాలు నచ్చితే తప్పకుండా ఫోన్ చేసి అభినందిస్తానని తెలిపారు.
ఎన్టీఆర్ గురించి మాట్లాడటానికి పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన పురంధేశ్వరి, ఇప్పుడు మరోసారి తనకున్న బంధాన్ని బయటపెట్టారు.
ఇదిలా ఉంటే, నందమూరి ఫ్యామిలీలో కోల్డ్ వార్ కొనసాగుతున్నట్లు ఇటీవల వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ కారణంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దూరంగా ఉంటున్నారని, అందుకే బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు ఎన్టీఆర్‌ను ఆహ్వానించలేదని పలు ప్రచారాలు జరిగాయి.
ఈ నేపథ్యంలో, పురంధేశ్వరి తాజా వ్యాఖ్యలు ఎన్టీఆర్‌తో తన బలమైన అనుబంధాన్ని బయటపెట్టడంతో పాటు, ఈ వదంతులకు ముగింపు పలికే అవకాశం ఉందని రాజకీయ, సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Recent Random Post:















