సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత, తాజాగా చేసిన ఇన్‌స్టా పోస్ట్‌లు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. అందులోనూ నాగచైతన్య వివాహం సమయంలో ఆమె సోషల్ మీడియాలో ఎలా స్పందించినా కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక లేటెస్ట్ గా ఆమె మరో ఆసక్తికరమైన పోస్ట్ చేయడం కూడా ట్రెండ్ అవుతోంది.
ఇటీవల తన వదిన నికోల్ జోసఫ్ పెట్టిన పోస్ట్‌ను సమంత షేర్ చేశారు. “ప్రపంచంలో మంచి వదినలు కూడా ఉంటారు. మా వదినను ఎప్పటికీ ప్రేమిస్తాను” అనే నికోల్ మాటల్ని షేర్ చేసిన సమంత “లవ్ యూ” అంటూ స్పందించారు. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగిన సోదరుడు డేవిడ్ వివాహ వేడుకలో సమంత పాల్గొని ఎంతో సంతోషంగా కనిపించింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో స్మైలీ ఫొటోలతోపాటు, స్ఫూర్తిమంతమైన పోస్టులు షేర్ చేయడం సమంతకు కొత్తేం కాదు. తాజాగా, “సిటడెల్: హనీ బన్నీ” టీమ్‌తో పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. “ఇంత గొప్ప టీమ్‌తో కలిసి పనిచేయడం నిజంగా గొప్ప గౌరవం,” అంటూ రాజ్ అండ్ డీకేతో పని చేయడం తనకు ప్రేరణనిచ్చిందని తెలిపారు. ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం అవుతోంది.
అలాగే సమంత మరో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగిన కుస్తీ పోటీలో అబ్బాయిని ఓడించిన అమ్మాయి వీడియోను షేర్ చేస్తూ “ఈ అమ్మాయిలాగా పోరాడండి” అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో అభిమానుల మధ్య వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకంగా సమంత పోరాటభావం, ఆత్మవిశ్వాసం గురించి అభిమానులు ప్రశంసిస్తున్నారు.
సమంత తన తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ, ఆ సందర్భంలో తండ్రి చెప్పిన ప్రేరణాత్మక మాటలు తన జీవితంపై ఎంతో ప్రభావం చూపాయని చెప్పిన సమంత, నటిగా రాణించిన తర్వాత తల్లిదండ్రులు తనపై గర్వించారని గుర్తుచేశారు. ఈ విషాదం మధ్య తన ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం సమంత వెబ్‌సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉన్నారు. “సిటడెల్: హనీ బన్నీ” రిలీజ్ కాగా, “మా ఇంటి బంగారం” సినిమా కోసం సిద్ధమవుతున్నారు. అలాగే, “రక్త్ బ్రహ్మాండ” అనే మరో వెబ్‌సిరీస్‌పై కూడా ఆమె పని చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు సమంత కెరీర్‌కు మరింత బూస్ట్ ఇవ్వనున్నాయి.
Recent Random Post: